Begin typing your search above and press return to search.
సునీల్ తో విలన్ చెడుగుడు...?
By: Tupaki Desk | 7 Nov 2021 7:00 PM ISTసునీల్ అంటే అందరికీ బాగా గుర్తిండిపోయే పాత్ర ఎప్పటికీ నువ్వు నాకు నచ్చావ్ లో బంతి క్యారక్టర్. ఆ మూవీలో కంప్లీట్ గా కనిపిస్తూ తనదైన కామెడీని సూపర్బ్ గా పండించాడు సునీల్. గోదావరి యాసతో పాటు ఎటకారాన్ని బాగా మిక్స్ చేసి ఆడియన్స్ కి కొత్త ఫీల్ ని కలిగించాడు. మొత్తానికి ఆ మూవీ హిట్ తో సునీల్ దశ ఒక్కసారిగా తిరిగింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యాడు. ఒక దశలో సునీల్ నంబర్ వన్ కమెడియన్ అన్న టాక్ నడిచింది.
సరిగ్గా అక్కడే సునీల్ గేర్ మార్చేశాడు. హీరోగా ట్రై చేయడంతో ఆయనలోని కమెడియన్ పూర్తిగా సైడ్ అయిపోయాడు. హీరోగా కూడా అంతంత మాత్రం హిట్లు దక్కాయి. తిరిగి వెనక్కి చూసుకుంటే కమెడియన్ గానూ ప్లేస్ లేకుండా పోయింది. ఈ టైమ్ లో సునీల్ విలన్ కి ట్రై చేశాడు. అది డిస్కో రాజాలో ఫట్ అయినా కలర్స్ మూవీలో మాత్రం బాగానే పండింది.
ఇపుడు సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న పుష్ప మూవీలో సీరియస్ కమెడియన్ గా కాస్తా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. సునీల్ గెటప్ చూస్తే కరడు కట్టిన విలన్ కనిపించేస్తున్నాడు. గెటప్ అలా డిజైన్ చేశారు. ఇక ఇది ఫక్తు నెటోరియస్ విలనీయే అంటున్నారు. సునీల్ కి ఇది బ్రహ్మాండమైన చాన్స్. పైగా సుకుమార్ డైరెక్షన్. పుష్ప మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. కాబట్టి హిట్ అయితే సునీల్ కెరీర్ మరో మలుపు తిరగడం గ్యారంటీ.
ఇవన్నీ పక్కన పెడితే ఏ నటుడి కెరీర్ లో లేనన్ని ట్విస్టులు వేరియేషన్స్ సునీల్ కెరీర్ లో కనిపించడమే ఇక్కడ విశేషం. సునీల్ కమెండియన్ గా వచ్చి, హీరోగా చేస్తూ విలన్ గా మారడం అంటే ఎవరూ టచ్ చేయని ప్రయోగాలే అనుకోవాలి. మొత్తానికి సునీల్ కెరీర్ గాడిలో పెట్టేది క్రూరమైన విలనీయేనా అంటే పుష్ప జవాబు చెప్పాలి.