Begin typing your search above and press return to search.

'రాధే శ్యామ్'లో స్పెషల్ సాంగ్ ఉండాలని పట్టుబడుతున్న ప్రొడ్యూసర్స్..?

By:  Tupaki Desk   |   11 Nov 2020 10:30 AM GMT
రాధే శ్యామ్లో స్పెషల్ సాంగ్ ఉండాలని పట్టుబడుతున్న ప్రొడ్యూసర్స్..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ''రాధే శ్యామ్'' అనే పీరియాడికల్ లవ్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రభాస్ 'విక్రమాదిత్య' పాత్రలో కనిపిస్తుండగా.. హీరోయిన్ పూజాహెగ్డే 'ప్రేరణ'గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం తెలుగు తమిళ మలయాళ కన్నడ వెర్షన్స్ కి మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే జస్టిన్ ఈ సినిమా నేపథ్యానికి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా నిర్మాతలైన యూవీ క్రియేషన్స్‌ టీమ్ 'రాధే శ్యామ్' లో స్పెషల్ సాంగ్ కావాలని కోరుతున్నారట. ఐటెమ్ సాంగ్ కి అవకాశం లేకపోయినా ప్రభాస్ సినిమాలో అలాంటి పాట ఉండాలని పట్టుబడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇప్పటికే 'రాధే శ్యామ్' లో స్పెషల్ నెంబర్ లో నర్తించే బ్యూటీ కోసం కాస్టింగ్ ఏజెంట్స్ గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానితో ఈ సాంగ్ చేయించే అవ‌కాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక గీతం ఉంటుందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్‌ మరియు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్స్ పై వంశీ - ప్రమోద్‌ - ప్రశీద నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందుతున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని 2021 సమ్మర్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.