Begin typing your search above and press return to search.
లైఫ్ లో మర్చిపోలేని 'డేట్' ను..ఇక విజయ్ మర్చిపోతారా?
By: Tupaki Desk | 26 Aug 2022 5:29 AM GMTఆగస్టు 25. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందులోనూ యూత్ ఐకానిక్ స్టార్.. అభిమానులు ప్రేమతో రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండకు అయితే.. ఈ తేదీతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఇంతవరకు ఈ డేట్ వచ్చినంతనే ఆయన ముఖంలో చిరునవ్వుతో పాటు.. ఆనందం వెల్లివిరిసేలా చేస్తోంది. మిగిలిన తేదీలతో పోలిస్తే ఆగస్టు 25 విజయ్ జీవితాన్నే మార్చేసింది. ఆయన్నో ఓవర్ నైట్ స్టార్ గా చేసింది. ఈ ఒక్క సినిమా టాలీవుడ్ లో అతన్నో అగ్రహీరోగా చేయటమే కాదు.. యూత్ కు ఇట్టే పట్టేసిన స్టార్ హీరోను చేసింది.
ఇంతకీ.. ఈ డేట్ కు ఉన్న ప్రత్యేకత విజయ్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదేళ్ల క్రితం ఆదే డేట్ లో అర్జున్ రెడ్డి మూవీ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ వేళకు విజయ్ దేవరకొండ ఇమేజ్ చాలా చాలా తక్కువ. ఆ మాటకు వస్తే..
ఆ రోజున ఆ సినిమా విడుదలైన రోజున కలెక్షన్లు మొత్తం చాలా చిన్నది. కానీ.. ఆ మూవీ అందించిన విజయంతో తిరుగులేని స్థానానికి చేరుకోవటమే కాదు.. అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఈ సినిమా తర్వాత విజయ్ తో మూవీ అంటే.. సాదాసీదా నిర్మాతలకు సాధ్యమయ్యే పని కాదన్నట్లుగా మారారు.
అలాంటి విజయ్ తో.. భారీ బడ్జెట్ తో మూవీని ప్లాన్ చేయటమే కాదు. పాన్ ఇండియాలో మూవీని తీశారు. ఏ డేట్ విజయ్ లైఫ్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారిందో.. సరిగ్గా అదే రోజున తాజాగా నటించిన లైగర్ మూవీని రిలీజ్ చేశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. ఐదేళ్ల క్రితం ఇదే రోజు ఆయన సుడిని తిప్పేసిన ఆగస్టు 25.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి. ఇప్పటివరకు విజయ్ కో సో స్పెషల్ గా ఉన్నఆగస్టు 25.. ఇప్పుడో పీడకలగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా చూస్తే.. కాలం చేసిన మేజిక్ అన్న భావన కలుగక మానదు. మర్చిపోలేని హిట్ ఇచ్చిన తేదీ.. ఇప్పుడు మాత్రం వీలైనంత త్వరగా మర్చిపోవాలన్నట్లుగా ఆగస్టు25 మారిందని చెప్పాలి. తొలిరోజున డిజాస్టర్ టాక్ వచ్చేయటంతో పాటు..
సోషల్ మీడియాలో ఈ మూవీపై వస్తున్న రివ్యూలు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోగా.. సినిమా చూడాలనుకునే వారిని సైతం డిస్ట్రబ్ చేసేలా ఉన్నాయంటున్నారు. ఇక.. సోషల్ మీడియాలో అయితే.. ఎవరికి వారు తమ క్రియేటివిటీ చూపిస్తూ చెలరేగిపోతున్న పరిస్థితి. ఆగస్టు 25.. ఎంత పని చేశావ్ అని విజయ్ అనుకునేలా చేసిందని చెప్పక తప్పదు.