Begin typing your search above and press return to search.

అభిమానులకు షాకింగ్: WWE నుంచి అండర్ టేకర్ రిటైర్

By:  Tupaki Desk   |   24 Nov 2020 10:15 AM IST
అభిమానులకు షాకింగ్: WWE నుంచి అండర్ టేకర్ రిటైర్
X
డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ ( WWE) అంటే ఉన్న క్రేజ్ ఎంతో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుస్తీ వస్తాదులు ఈ రెజ్లింగ్ ఆటలో హోరాహోరీగా ఢీకొంటుంటే ఆ మజానే వేరు. ఈ కార్యక్రమం అత్యంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చూసేందుకు జనాలు ఎగబడుతుంటారు. చాలా మంది రెజ్లింగ్ స్టార్ లు పాల్గొంటారు. వీరికి ఒక్కొక్కరికి మంచి ఫాలోయింగ్ ఉంది

డబ్ల్యూ.డబ్ల్యూ.ఈలో సూపర్ స్టార్ గా అండర్ టేకర్ కు పేరుంది. చాలా మందికి ఇష్టమైన సీనియర్ రెజ్లర్ ఇప్పుడు ఆట నుంచి రిటైర్ అవుతున్నారు. అండర్టేకర్ తన పదవీ విరమణ ప్రకటించారు. డబ్ల్యూడబ్ల్యూఈ సర్వైవర్ సిరీస్ ఈవెంట్ ముగిసిన తరువాత అతను తన చివరి వీడ్కోలు మ్యాచ్ ఆడి వైదొలగనున్నట్టు ప్రకటించాడు.

అండర్టేకర్ ఈ డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ లో 30 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. ‘అండర్టేకర్ విశ్రాంతి ఇక తీసుకుంటాడు’ డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ నిర్వాహకుడు ధృవీకరించాడు. అండర్టేకర్ చివరి మ్యాచ్ లో ఆశ్చర్యకరమైన అతిధి పాత్రలో వస్తాడని.. అప్పుడే అధికారికంగా రిటైర్ ప్రకటిస్తాడని చెబుతున్నారు.

డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ నుంచి అండర్టేకర్ రిటైర్ మెంట్ ప్రకటన ఆయన అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. పదవీ విరమణ వార్త తెలియగానే చాలామంది ఉద్వేగానికి లోనయ్యారు.అండర్ టేకర్ గురించి విన్స్ మక్ మహోన్ చేసిన ప్రసంగం కూడా వారందరినీ కదిలించింది. అండర్టేకర్ సినిమాల్లో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే రెజ్లింగ్ స్టార్లు ‘రాక్, స్టోన్కోల్డ్ మరియు జాన్ సెనా వంటివారు సినిమాల్లో నటిస్తున్నారు.

అండర్ టేకర్ వీడ్కోలు సందేశాలతో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోతోంది. డబ్ల్యూ.డబ్ల్యూ.ఈ ట్విట్టర్ పేజీలో అతడిపై ట్వీట్లు హోరెత్తుతున్నాయి. ఆయన జ్ఞాపకాలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.