Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఫ్యామిలీ సొంత ఓటీటీ వేదిక ప్లాన్

By:  Tupaki Desk   |   15 July 2020 9:30 AM IST
మ‌హేష్ ఫ్యామిలీ సొంత ఓటీటీ వేదిక ప్లాన్
X
క‌రోనా మ‌హ‌మ్మారీ సినీప‌రిశ్ర‌మ‌ల‌కు కొత్త పాఠాలు నేర్పిస్తోంది. బుల్లితెర‌- ఓటీటీ మార్కెట్ల‌కు అమాంతం గిరాకీ పెరిగింది. డిజిట‌ల్ దే భ‌విష్య‌త్ అని ప్రూవైంది. ముఖ్యంగా అమెజాన్-నెట్ ఫ్లిక్స్ ల‌కు ధీటుగా జీ5.. డిస్నీ హాట్ స్టార్.. ఈరోస్.. స‌న్ నెక్ట్స్ వంటి ఇత‌ర ఓటీటీ మాధ్య‌మాలు పోటీప‌డేందుకు స‌రికొత్త ఎత్తుగ‌డలు వేస్తూ దూసుకుపోతున్నాయి. ఇక వీళ్ల‌కు పోటీగా ప్రాంతీయంగా లోక‌ల్ ఓటీటీలు మ‌నుగ‌డ సాగించేందుకు చేస్తున్న బిగ్ ఫైట్ ఆస‌క్తిని పెంచుతోంది.

ఇప్ప‌టికే టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను మంది అగ్ర నిర్మాత‌లు సొంత ఓటీటీల్ని ప్రారంభించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నార‌ని వార్త‌లొచ్చాయి. తొలిగా బాస్ అల్లు అర‌వింద్ ఆహా- తెలుగు ఓటీటీని ప్రారంభించారు. పోటీలో నిల‌బ‌డేందుకు అవ‌స‌ర‌మైన స‌రంజామాని రెడీ చేసి వీక్ష‌కుల‌కు అందిస్తున్నారు. అలానే అల్లు వారికి పోటీగా కొణిదెల కాంపౌండ్ సొంత ఓటీటీకి ప్లాన్ చేస్తోంద‌ని మెగా వార్ కి రంగం సిద్ధం చేస్తున్నార‌ని ఇటీవ‌ల వార్త‌లొచ్చాయి. దిల్ రాజు- సురేష్ బాబు- క‌ళ్యాణ్ రామ్- నాగార్జున‌ స‌హా ప‌లువురు సొంత ఓటీటీల‌కు ప్లాన్ చేసే వీలుంద‌ని ప్ర‌చార‌మైంది.

అయితే ఈలోగానే ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్ నుంచి ఓ ఆస‌క్తిక‌ర వార్త లీకైంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌ ఫ్యామిలీ ఓటీటీ మార్కెట్లోకి ప్ర‌వేశించ‌నున్నార‌న్న‌ది దాని సారాంశం. ఇప్ప‌టికే దీనిపై లీకులు అందిన‌ సంగ‌తి తెలిసిందే. రిల‌య‌న్స్ జియో ప్రారంభించే ఓటీటీ తెలుగు ప్రాంచైజ్ ని మ‌హేష్‌ తీసుకుంటాడ‌ని అంతా అంటున్నారు. అయితే మ‌హేష్‌ స‌న్నిహిత వ‌ర్గాలు మాత్రం జీయోకి కేవ‌లం క్రియోటివ్ స‌పోర్ట్ మాత్ర‌మే మ‌హేశ్ అండ్ టీమ్ ఇస్తార‌ని.. దానికి సౌత్ లో బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మ‌హేష్‌ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని చెబుతున్నారు. ప్యార‌ల‌ల్ గా త‌న‌కంటూ ఓ స‌ప‌రేట్ ఓటీటీని ప్రారంభించే ఆలోచ‌న మ‌హేష్ కి ఉంది. పిల్ల‌ల‌కి ఎక్స్ క్లూసివ్ గా ఓ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రెడీ చేయ‌డానికి మ‌హేష్‌ ప్లాన్ చేస్తున్నాడ‌ని దానికి కొన్ని పేర్లు కూడా ప‌రిశీలిస్తాడ‌ని తాజాగా లీకులందాయి. త‌న పిల్లిద్ద‌రి పేర్లు క‌లిసే రీతిన ఓ టైటిల్ పెట్ట‌డానికి ప్లాన్ చేస్తున్నాడ‌ని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.