Begin typing your search above and press return to search.

ముగ్గురు మొన‌గాళ్లు టైటిల్ పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్

By:  Tupaki Desk   |   2 May 2021 5:30 PM GMT
ముగ్గురు మొన‌గాళ్లు టైటిల్ పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్
X
క్రియేటివ్ పోస్ట‌ర్ల‌తో టాలీవుడ్ లో స‌రికొత్త ఒర‌వడి సృష్టించారు అల్ల‌రి ర‌విబాబు. ఆయ‌న ఒక పోస్ట‌ర్ వేశారంటే దానిపై యూత్ లో చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. ఆయ‌న పోక‌డ‌లో హాలీవుడ్ స్ఫూర్తి ఉన్నా అది తెలుగు వారికి ఇట్టే క‌నెక్ట‌వుతుంది. ఇప్పుడు ఈ యంగ్ టీమ్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ పైనా అంతే క్యూరియాసిటీ నెల‌కొంది.

త్రీ మంకీస్(ఏప్స్) స్ఫూర్తితో.. `ముగ్గురు మొన‌గాళ్లు` అంటూ టైటిల్ పోస్ట‌ర్ ని లాంచ్ చేశారు. త్వ‌ర‌లోనే ఫస్ట్ లుక్ ని లాంచ్ చేయ‌నున్న ఈ టీమ్ వివ‌రాల్లోకి వెళితే వై.ఎస్.ఆర్.. దీక్షిత్ శెట్టి (దియా ఫేం) ప్ర‌ధాన తారాగ‌ణంగా అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌మందిర్ స్టూడియోస్ ప‌తాకంపై పి.అచ్యుత్ రామారావు నిర్మిస్తున్న‌ చిత్ర‌మిది.

వెన్నెల రామారావు.. రాజా ర‌వీంద‌ర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. అంజి సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తారు.