Begin typing your search above and press return to search.
కథ టైటిల్ వారికి నచ్చినట్లే ఉండాలి లేదంటే అంతే..!
By: Tupaki Desk | 5 Jun 2021 6:00 AM ISTఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం ఫిల్మ్ మేకర్స్ క్రియేటివిటీ విషయంలో కొన్ని హద్దులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా సన్నివేశాలు తీసే అవకాశం గతంలో ఉండేది. కాని ఇప్పుడు ఎలాంటి సన్నివేశం తీస్తే ఎవరి మనో భావాలు దెబ్బ తింటాయో అనే ఆందోళన ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ వ్యక్తం చేస్తున్నాడు. బాలీవుడ్.. కోలీవుడ్.. టాలీవుడ్ ఇలా అన్ని భాషల సినిమా పరిశ్రమలో కూడా ఇదే కనిపిస్తుంది. ప్రతి సన్నివేశం కూడా కొందరి మనో భావాలు దెబ్బ తీసే విధంగా ఉంటాయంటూ వివాదం లేవనెత్తతున్నారు. సోషల్ మీడియా పరిధి పెరిగిన కారణంగా ఎక్కువ మంది సినిమాల మేకింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది.
బాలీవుడ్ సినిమాల విషయంలో ముఖ్యంగా కాస్త పీరియాడిక్ నేపథ్యంలో సినిమా లు తీయాలంటే కర్ణి సేన నుండి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ముందు నుండే ఆందోళన చెందాల్సి వస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన పలు సినిమాలు సీన్స్ తొలగించడం మొదలుకుని టైటిల్ మార్చే వరకు వివాదం కొనసాగింది. సల్మాన్.. అక్షయ్ కుమార్ సినిమాలతో పాటు దీపిక పదుకునే కంగనా సినిమాల విషయంలో కూడా కర్ణి సేన వివాదాస్పదం చేసి తమ పంథం నెగ్గించుకున్నాయి.
దీపిక పదుకునే నటించిన పద్మావతి సినిమా ను విడుదల కాకుండా ప్రయత్నించారు. ముఖ్యంగా తమ వర్గం వారిని అవమానించే విధంగా పద్మావతిని తప్పుగా చూపించారంటూ ఆరోపించారు. దాంతో సినిమా లో కొన్ని సన్నివేశాలు తగ్గించడంతో పాటు టైటిల్ ను పద్మావత్ గా మార్చారు. ప్రస్తుతం అక్షయ్ చేస్తున్న పృథ్వీరాజ్ సినిమా టైటిల్ విషయంలో కూడా వివాదం కొనసాగుతోంది. కర్ణి సేన ఈ సినిమాకు వీర యోధా సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ అంటూ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొన్ని కథలను మార్చడం మొదలుకుని సీన్స్ తొలగించడం వరకు చాలా చాలా చేశారు. దాంతో కర్ణి సేన కు భయపడుతూ సినిమాలు చేయాల్సిన పరిస్థితి.