Begin typing your search above and press return to search.

ఆస్కార్ కమిటీలో మన ముగ్గురు

By:  Tupaki Desk   |   3 July 2021 6:35 AM GMT
ఆస్కార్ కమిటీలో మన ముగ్గురు
X
హాలీవుడ్‌ సినిమా ల నుండి ప్రాంతీయ భాషల సినిమాల వరకు ఆస్కార్‌ అవార్డుల కోసం పోటీ పడతాయి. అద్బుతమైన అంతర్జాతీయ సినిమాలకు అవార్డులను ఇచ్చే ఆస్కార్‌ అకాడమీ వారు వచ్చే ఏడాదికి గాను కొత్త సభ్యులను ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల నుండి కమిటీలో సభ్యులుగా తీసుకున్నారు. మొత్తం 395 మందికి ఈ కమిటీలో చోటు కల్పించిన అకాడమీ వారు బాలీవుడ్‌ కు చెందిన ముగ్గురు మహిళలకు అవకాశం ఇవ్వడం జరిగింది. బాలీవుడ్‌ స్టార్‌ నటి విద్యా బాలన్ కు ఈ సారి కమిటీ లో అవకాశం దక్కగా.. నిర్మాత కమ్‌ బుల్లి తెర సెలబ్రెటీ అయిన ఏక్తా కపూర్‌ మరియు ఆమె తల్లి శోభా కపూర్‌ లకు కూడా కమిటీలో అవకాశం ఇవ్వడం జరిగింది.

మొతత్ం 395 మందిలో 46 శాతం మంది మహిళలే అవ్వడం ఈసారి ప్రత్యేక అంశంగా చెప్పుకోవచ్చు. ద క్లాస్ ఆఫ్‌ 2021 పేరుతో ఈ కమిటీని ఆస్కార్‌ అకాడమీ జాబితాను విడుదల చేసింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆస్కార్‌ ఇండియా సభ్యులు ఇండియన్‌ భాషల్లో రూపొందిన సినిమాలను పరిశీలించి ఆస్కార్‌ పోటీకి పంపించాల్సి ఉంటుంది. గత ఏడాదికి గాను ఆకాశమే నీ హద్దుగా ఆస్కార్‌ కు పోటీ పడ్డ విషయం తెల్సిందే. ప్రతి సంవత్సరం ఇండియా నుండి ఆస్కార్‌ కు నామినేట్‌ అవుతున్నాయి కాని ఆస్కార్‌ అవార్డును మాత్రం దక్కించుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది.

ఇండియన్‌ సినిమాల్లో కమర్షియల్‌ ఎలిమెంట్స్ మినహా మంచి కంటెంట్ ఉండదు అంటూ హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఆస్కార్‌ నియమించిన కమిటీ సభ్యులు ఇక్కడ ఆస్కార్‌ రేంజ్ సినిమాల నిర్మాణంకు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. కాని వారు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇండియన్‌ సినిమాలకు ఆస్కార్‌ అవార్డులు అందరి ద్రాక్ష మాదిరిగానే అయ్యిందని కొందరు సినీ ప్రేమికులు అంటున్నారు. ఇండియాలో రూపొందే సినిమాల విషయంలో మాత్రమే వీరు నిర్ణయం తీసుకుని ఆస్కార్‌ అకాడమీకి పంపించే బాధ్యతను తీసుకుంటున్నారు. అంతకు మించి వీరి విధులు నిర్వర్తించడం లేదు. గతంలో ఉన్న సభ్యులు కూడా అదే తరహాలో వ్యవహరించారు. కాని ఈసారి ముగ్గురు మహిళలు అయినా ఇండియన్ సినిమాల స్థాయిని ఆస్కార్‌ అవార్డుల స్థాయికి తీసుకు వెళ్లేందుకు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారేమో చూడాలి.

ఇండియన్‌ సినిమాలకు ఆస్కార్‌ ఎందుకు రావడం లేదని సగటు సినీ అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నీ సమయంలో ఈసారి ముగ్గురు మన లేడీస్ స్థానం దక్కించుకున్న కారణంగా ఖచ్చితంగా భవిష్యత్తులో ఆస్కార్‌ కు మన సినిమా లు మరింతగా పోటీ ఇస్తాయని అంతా నమ్మకంగా చెబుతున్నారు. అతి చిన్న ఇండస్ట్రీ అయిన కొరియన్‌ ఇండస్ట్రీ వరుసగా ఆస్కార్‌ లు దక్కించుకుంటూ ఉంటే మన ఇండియన్‌ సినిమాలు మాత్రం ఇంకా ఆస్కార్‌ కు నామినేట్ అవ్వడమే గొప్ప విషయంగా అనుకుంటూ ఉన్నారు.