Begin typing your search above and press return to search.

ఎఫ్‌3 లో ఆ మూడవ హీరో ఇతడేనా?

By:  Tupaki Desk   |   5 April 2021 7:30 AM GMT
ఎఫ్‌3 లో ఆ మూడవ హీరో ఇతడేనా?
X
వెంకటేష్‌.. వరుణ్‌ తేజ్‌ లు హీరోలుగా అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్‌ 2 సినిమా సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ఎఫ్ 2 విడుదల అయిన సమయంలోనే ఎఫ్‌ 3 సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. ఆ సమయం నుండే ఎఫ్‌ 3 లో ఇద్దరు హీరోలు కాదు మరో హీరో కూడా నటించబోతున్నాడు. మొత్తం ముగ్గురు హీరోలు ఎఫ్ 3 లో ఉంటారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఎఫ్‌ 3 సినిమాలో మహేష్‌ బాబు ను మహేష్‌ బాబు ను మూడవ హీరో పాత్ర కోసం అనీల్‌ రావిపూడి సంప్రదించాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని దర్శకుడు అనీల్‌ రావిపూడి స్పందిస్తూ ఎఫ్‌3 కోసం మహేష్‌ బాబును సంప్రదించలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్‌ సీన్స్‌ మరియు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందంటున్నారు. ఇక ఈ సినిమా లో సునీల్‌ పాత్ర గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. సినిమాలో సునీల్‌ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడట. వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లతో కలిసి ఆయన మొదటి నుండి చివరి వరకు కామెడీ పండిస్తాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో సునీల్‌ మూడవ హీరో పాత్రను చేశాడనుకోవచ్చు అంటూ అనధికారికంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఎఫ్‌ 3 సినిమా లో ఎఫ్‌ 2 ను మించిన ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అంటున్నారు.

ఎఫ్‌2 తరహాలోనే ఈ సినిమాలో కూడా వెంకటేష్‌ కు జోడీగా తమన్నా మరియు వరుణ్‌ తేజ్‌ కు జోడీగా ముద్దుగుమ్మ మెహ్రీన్‌ లు హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ఎఫ్‌ 2 సినిమా కథ మొత్తం కూడా డబ్బు చుట్టు తిరుగుతుందని.. వెంకీ మరియు వరుణ్‌ లు డబ్బు సంపాదించేందుకు పడే బాధలు వారి ఆర్థిక అవసరాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా దర్శకుడు చాలా ఫన్నీగా చూపించబోతున్నాడట. సునీల్‌ సినిమాలో పలు సీన్స్ లో కన్ఫ్యూజ్‌ కారణంగా వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ లను ఇబ్బంది పెడుతూ తాను ఇబ్బంది పడుతూ ఉంటాడట. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ మరియు రాజేంద్ర ప్రసాద్‌ లు కూడా నవ్వులతో ముంచెత్తబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ సినిమా నవ్వులు పూయించడంలో ఎఫ్‌ 2 ను మించి పోతుందని అంటున్నారు.