Begin typing your search above and press return to search.

'నటసామ్రాట్‌' తెలుగు వర్షన్‌ రిలీజ్ కు సిద్దం

By:  Tupaki Desk   |   29 March 2021 10:30 AM GMT
నటసామ్రాట్‌ తెలుగు వర్షన్‌ రిలీజ్ కు సిద్దం
X
మరాఠీ క్లాసిక్ మూవీ నటసామ్రాట్‌ ను తెలుగులో క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ 'రంగమార్తాండ' అంటూ రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణ.. ప్రకాష్‌ రాజ్‌.. బ్రహ్మానందం.. అనసూయ.. రాహుల్‌ సిప్లిగంజ్.. శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న ఈ రంగస్థల డ్రామా బ్యాక్‌ డ్రాప్‌ మూవీ గురించి గడచిన మూడు సంవత్సరాలుగా ఇండస్ట్రీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. సినిమా షూటింగ్‌ ఎంత వరకు వచ్చింది.. విడుదల ఎప్పుడు అనే విషయాలను దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించక పోవడంతో ఆయన అభిమానులు మరియు సినిమాలో నటించిన వారి అభిమానులు గందరగోళంతో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన అప్‌ డేట్‌ ఒకటి వచ్చింది.

రంగమార్తాండ సినిమా షూటింగ్‌ ను దర్శకుడు కృష్ణవంశీ పూర్తి చేశాడట. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారని కూడా తెలుస్తోంది. ఈ సినిమా ను మే నెలలో విడుదల చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారట. మే నెలలో చివరి రెండు వారాలు పెద్ద సినిమాలకు సంబంధించి విడుదలలు లేవు. దాంతో ఆ డేట్‌ ను పిక్స్‌ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ తేదీ మిస్‌ అయితే మళ్లీ రెండు నెలల వరకు బిజీగానే అన్ని వారాలు ఉన్నాయంటున్నారు. కనుక రంగమార్తాండ సినిమా ను మే లో విడుదల చేస్తే ఒక పనైపోతుందని అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మేకర్స్ అభిప్రాయం ఏంటీ వారు ఎప్పుడు ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు అనేది అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.