Begin typing your search above and press return to search.

బయోపిక్ మాత్రం కాదు: RC16పై క్లారిటీ..!

By:  Tupaki Desk   |   28 April 2023 10:30 AM IST
బయోపిక్ మాత్రం కాదు: RC16పై క్లారిటీ..!
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తన తదుపరి చిత్రం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాకి పేరు కన్ఫామ్ చేయలదు కానీ.. RC16 అని పిలుస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతోంది. అయితే, ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచి చాలా రకాల రూమర్స్ వినపడుతున్నాయి.

ఓ క్రీడాకారుడి బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపించాయి. అయితే, ఈ రూమర్స్ కి చిత్ర బృందం చెక్ పెట్టింది. సినిమా క్రీడ ఆధారంగా సాగుతుందని, కాకపోతే బయోపిక్ కాదని క్లారిటీ ఇచ్చారు.
క్రీడల ఆధారంగా సాగే కల్పిత కథ ఈ సినిమా అని చిత్రబృందం తెలిపింది. బుచ్చికథ తన కల్పనల ఆధారంగా సృష్టించిన కథ ఇదని, ఏ ఒక్క స్పోర్ట్స్ పర్సన్ కి సంబంధించినది కాదని చెప్పారు.

ఇక ఈ సినిమా కథను బుచ్చిబాబు పూర్తిచేసేలోపు, రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ ని పూర్తి చేసుకునే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. షూటింగ్ వివరాలు అధికారికంగా అయితే వెలువడలేదు.

ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌తో, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా ప్రచారం జరుగుతోంది. కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా సినిమా గా దీనిని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి మ్యూజిక్ ని ఏఆర్ రెహమాన్ ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఇంకా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే సినీ నటలుు, మ్యూజిక్ వంటి సమాచారం ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. దీనిని ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనిలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.