Begin typing your search above and press return to search.

లెజెండ్ రుణం ఆ సూప‌ర్ స్టార్ అలా తీర్చుకుంటాడా?

By:  Tupaki Desk   |   25 July 2022 2:30 PM GMT
లెజెండ్ రుణం ఆ సూప‌ర్ స్టార్ అలా తీర్చుకుంటాడా?
X
టాలీవుడ్ లో అత‌నో లెజెండ్. న‌టుడిగా సుదీర్ఘం అనుభ‌వం ఆయ‌న‌ది. ఆయ‌న వార‌స‌త్వం టాలీవుడ్ లో దిగ్విజ‌యంగా కొన‌సాగుతుంది. ఆయ‌న నాటిన మొక్క నేడు పెద్ద వృక్ష‌మే అయింది. ఇప్పుడా ఆ వృక్షం కుటుంబం మొత్తానికి నీడ‌ని అందిస్తుంది. ఇక వ్య‌క్తిగ‌తంగా ఆయ‌నెంతో సౌమ్యుడు..మృదుస్వ‌భావి. త‌న‌మ‌న అనే బేధం ఉండ‌దు.

ఆయ‌న ముందు అందరూ స‌మానులే. పెద్దాయ‌న‌ ఔన్న‌త్యం..గొప్ప‌త‌నం గురించి మాట‌ల్లో వర్ణించ‌డం సాధ్య‌ప‌డ‌నిది. అంత‌టి దిగ్గ‌జం ఓ ప‌ర‌భాష సూపర్ స్టార్ కోసం ఏకంగా దిగొచ్చి తానే స‌మ‌ర్ప‌కుడిగా ఆ సినిమాకి పేరు వేసుకున్నారు. ఆ స్టార్ కోర‌డంతో ..ఆయ‌న మాట కాద‌నులేక కాదు. ఇలాంటి సినిమాలో తాను ఏదోరూపేణా భాగ‌మైతే బాగుండ‌ని మ‌న‌సుకు తోచింది.

ఇంత‌లో అదే ఆహ్వానంతో ఆ సూప‌ర్ స్టార్ ముందుకొచ్చారు. దీంతో మ‌రో మాట లేకుండా పెద్దాయ‌న స‌మ‌ర్ప‌కుడిగా ఫిక్స్ అయిపోయారు. ఆ ర‌కంగా లెజెండ్ కి సూప‌ర్ స్టార్ రుణ ప‌డ్డారు. కానీ ఆ రుణాన్ని ఉంచుకోరు. ఏదో రూపంలో తిరిగివ్వాలిగా. అందుకే ఇప్పుడాయ‌న మ‌న‌సులో ఆ లెజెండ్ త‌న‌యుడి సినిమాలో భాగ‌మైతే కొంతైనా ఆరుణాన్ని తీర్చుకున్న‌ట్లు అవుతుంద‌ని నిన్న‌టి రోజున ఫిలిం స‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్ కి వ‌చ్చింది.

త‌న‌యుడు న‌టించే త‌దుప‌రి సినిమా నిర్మాణంలో భాగ‌స్వామి అయితే అదే పెద్దాయ‌నికి ఇచ్చే అతిపెద్ద బహుమ‌తి అవుతుంద‌ని స‌ద‌రు సూప‌ర్ స్టార్ అనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆపాన్ ఇండియా స్టార్ త‌దుప‌రి న‌టించ‌బోయే సినిమాకి హిందీ వెర్ష‌న్ నిర్మాత‌గా ఉండాల‌ని భావిస్తున్నారుట‌. ప్ర‌స్తుతం ఆ హీరో ఓ బ‌డా సినిమాలో న‌టిస్తున్నాడు.

త‌దానంత‌రం ఓ యంగ్ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌నున్నాడు. ఇది కూడా పాన్ ఇండి యా కేట‌గిరీలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది.

అయితే తెలుగుతో పాటు ఇందీ లోనూ నిర్మించాల‌ని ఆలోచ‌న చేస్తున్నారుట‌. ఒక‌వేళ అదే గ‌నుక నిజ‌మైతే ఈ సినిమా కి హిందీ వెర్ష‌న్ కి సంబంధించి పూర్తిస్థాయిలో త‌న స‌హ‌కారం ఉంటుంద‌ని ప్రామిస్ చేసిన‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌కొస్తుంది. మ‌రి ఇది సాధ్య‌మ‌వుతుందా? ల‌ఏదా? అన్న‌ది అప్ప‌టి ప‌రిస్థితుల మీద ఆధార‌ప‌డి ఉంటుంది. అనుకున్న‌వ‌న్నీ జ‌రిగిపోవు క‌దా