Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్‌ కావాలంటూ సూపర్ స్టార్‌ డిమాండ్‌..!

By:  Tupaki Desk   |   4 Jan 2023 8:30 AM GMT
ఆ హీరోయిన్‌ కావాలంటూ సూపర్ స్టార్‌ డిమాండ్‌..!
X
తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ నటించిన వారసుడు సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు స్టార్‌ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన మాస్టర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా విక్రమ్‌ సినిమాతో కమల్‌ హాసన్ కి లోకేష్ కనగరాజ్ ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఇంతటి భారీ విజయాలను సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ సినిమా అంటే కేవలం తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా క్రేజ్ ఉంది. అందుకే విజయ్ తో ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతుంది. అంతే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని కూడా అంతా నమ్మకంతో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా సర్కిల్స్ లో ఈమధ్య కాలంలో వినిపిస్తున్న వార్తల అనుసారంగా ఈ సినిమాలో త్రిష ను తీసుకోవాల్సిందిగా స్వయంగా విజయ్ సిఫార్సు చేశాడని.. ఆమెతో చాలా సంవత్సరాల తర్వాత విజయ్ నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.

విజయ్‌ ఆదేశించడం వల్లే లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో త్రిష ను ఎంపిక చేయడం జరిగిందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా యొక్క హీరోయిన్‌ ఎంపిక విషయంలో విజయ్ దే నిర్ణయం అని.. కథను తగ్గట్లుగా ఆమె అయితేనే బాగుంటుందని విజయ్ భావించడం వల్ల త్రిష ఎంపిక జరిగిందని తమిళ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

లోకేష్ కనగరాజ్ కి ఉన్న ఇమేజ్ నేపథ్యంలో ఆయన మాటకు ప్రతి స్టార్‌ హీరో కూడా కట్టుబడి ఉండాలి. కానీ విజయ్ మాత్రం హీరోయిన్‌ విషయంలో తన పంతం నెగ్గించుకున్నాడు అంటూ తమిళ సినీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.