Begin typing your search above and press return to search.

ఏం జ‌రిగినా రేపు సూర్యుడు ఉద‌యిస్తాడు! అది ఒక్క‌టే గ్యారెంటీ!

By:  Tupaki Desk   |   31 March 2021 8:00 AM IST
ఏం జ‌రిగినా రేపు సూర్యుడు ఉద‌యిస్తాడు! అది ఒక్క‌టే గ్యారెంటీ!
X
``ఈ రోజు ఏం జరిగినా రేపు సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడని తెలుసుకోవడంలో వింత ఓదార్పు ఉంది. ఈ రోజు మనం భరించే ప్ర‌తి పోరాటం రేపటి రోజున‌ మనం నవ్వే మంచి పాత రోజులు. జీవితం మిమ్మ‌ల్ని పరీక్షిస్తుంది. మిమ్మల్ని మంచి ఆకృతిలోకి తీర్చిదిద్దుతుంది. కానీ మీరు ఎవరో మార్చడానికి గ‌తాన్ని అనుమతించవద్దు`` -ఆరోన్ లౌరిట్ సెన్ ప్ర‌ఖ్యాత కొటేష‌న్ ఇది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడు అన్నిటినీ అధిగ‌మించి ఎంతో ఉల్లాస‌భ‌రిత‌మైన జీవ‌నాన్ని సాగిస్తున్న ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి మ‌లైకా అరోరాఖాన్ ఈ కొటేష‌న్ ని షేర్ చేస్తూ ప‌నిలో ప‌నిగా ఓ యోగాస‌నానికి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు

మీరు హద్దులు దాటిపోతూ ఉండండి! శ్రేష్ఠమైన దాని కోసం కష్టపడండి! నేర్చుకోండి మ‌రిచిపోయిన‌వి తిరిగి నేర్చుకోండి! అంటూ మ‌లైకా ఎమోష‌న‌ల్ ట్వీట్లు చేశారు. ఏదేమైనా కానీ త‌న లైఫ్ లో అర్జున్ క‌పూర్ రూపంలో ఒక మంచి స్నేహితుడు ప్ర‌వేశించాక ఆ ఆనందాన్ని మ‌లైకా ఎప్పుడూ దాచుకోలేదు. ప్ర‌తిసారీ త‌న లైఫ్ లో కొత్త మార్పున‌కు ఆనందం వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు.

ఈసారి హోలీని త‌న బోయ్ ఫ్రెండ్ అర్జున్ క‌పూర్ స‌మ‌క్షంలో ఎంతో ఆస్వాధించార‌ట మ‌లైకా. అర్జున్ అతని కజిన్ రియా కపూర్ తో మ‌లైకా గడిపారు. మలైకా - అర్జున్ జంట‌ ప్రస్తుతం అలీబాగ్ లోని విలాసవంతమైన రిసార్ట్ లో సెల‌బ్రేష‌న్ లో ఉన్నారు.

2021లో ప్రవేశించ‌క ముందే మ‌లైకా- అర్జున్ జోడీ అస‌లైన సెల‌బ్రేష‌న్ ప్రారంభించింది. గత సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఈ జంట‌ విహారయాత్రకు గోవా వెళ్లారు. అమృత అరోరా ఆమె కుటుంబం కూడా వారితో పాటు వచ్చింది. తీరప్రాంతంలో నూతన సంవత్సరం వేడుక‌లు ఘ‌నంగా సాగాయి. ఈ వేడుక‌లు అలా నిరంత‌రాయంగా సాగుతూనే ఉన్నాయి. అందుకే నేటి చీక‌టిని దూరం చేస్తూ రేపు సూర్యుడు ఉద‌యించిన‌‌ట్టే .. ఆనందం క‌ష్టం సుఖం దుఃఖం అన్నీ వ‌స్తూ పోతుంటాయనేది మ‌లైకా భావ‌న‌.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే....అర్జున్ కపూర్ చివరిసారిగా దిబాకర్ బెనర్జీ సందీప్ ఔర్ పింకీ ఫరార్ లో కనిపించారు. భూత్ పోలీస్- ఏక్ విలన్ రిటర్న్స్ వంటి చిత్రాలలో కూడా న‌టిస్తున్నారు.

నెట్ ‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్`లో మలైకా అరోరా అతిథి పాత్రలో కనిపించారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ షో నలుగురు బాలీవుడ్ స్టార్ భార్యలు మహీప్ కపూర్- నీలం కొఠారి సోని- సీమా ఖాన్ - భవానా పాండే జీవితాలను ఆధారంగా రూపొందించారు.