Begin typing your search above and press return to search.

స్టార్ హీరో సినిమాల్ని బ్యాన్ చేసిన రాష్ట్రం

By:  Tupaki Desk   |   17 March 2022 5:30 AM GMT
స్టార్ హీరో సినిమాల్ని బ్యాన్ చేసిన రాష్ట్రం
X
మలయాళంలో స్టార్ హీరోగా పేరున్న దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకున్న టాలెంట్ తో మలయాళంతో పాటు తమిళ.. కన్నడ.. తెలుగు.. హిందీ ప్రేక్షకులకు కూడా అతడు సుపరిచితుడు.

భిన్నమైన సినిమాల్ని చేస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న అతగాడు తాజాగా వివాదంలో చిక్కుకున్నాడు. అతడి సినిమాల్ని కేరళలో బ్యాన్ చేస్తున్నట్లుగా కేరళ సినిమా థియేటర్ల అసోసియేషన్ స్పష్టం చేసింది.

స్టార్ హీరో మమ్ముట్టి కొడుకుగా తెరగ్రేంటం చేసినా.. చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న దుల్కర్ నటించిన తాజా చిత్రం సెల్యూట్ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

తాజా బ్యాన్ కు కారణం ఈ సినిమా విడుదలగా చెప్పక తప్పదు. దీనికి కారణం.. తన సినిమాను నేరుగా విడుదల చేయకుండా.. ఓటీటీలోనే రిలీజ్ చేయటం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న సెల్యూట్ చిత్రాన్ని తొలుత థియేటర్లలోనే విడుదల చేయాలని భావించారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగాయని చెబుతారు. అలాంటిది మధ్యలో ఏమైందో కానీ.. అనూహ్యంగా తమ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లుగా సినిమా నిర్మాతలు పేర్కొనటంతో వివాదం రాజుకుంది.

ఈ మూవీని ఈ నెల 18న సోనీ లివ్ లో విడుదల చేయనున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన కేరళ సినిమా థియేటర్ల యజమానులు.. దుల్కర్ సినిమాల్ని కేరళలో నిషేధిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మరి.. ఈ వివాదం మరెక్కడి వరకు వెళుతుందో చూడాలి.