Begin typing your search above and press return to search.

హీరో, అత‌ని ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టిన స్టార్ హీరోయిన్‌

By:  Tupaki Desk   |   10 Feb 2022 6:38 AM GMT
హీరో, అత‌ని ఫ్యామిలీని ప‌క్క‌న పెట్టిన స్టార్ హీరోయిన్‌
X
ఇత‌ర భాష‌ల‌కు చెందిన హీరోయిన్ లు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి ఆ త‌రువాత స్టార్ లుగా మారుతున్నారు. అలా స్టార్ హీరోయిన్ లుగా ఎదిగి త‌మ‌కు తొలి సారి టాలీవుడ్ లో అవ‌కాశం ఇచ్చిన హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చిన వారిని మాత్రం మ‌రిచిపోవ‌డం లేదు.

కానీ అలా తొలి సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ ని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ హీరోయిన్ ఇప్ప‌డు త‌న‌కు తొలి అవ‌కాశాన్నిచ్చిన హీరోని, అత‌ని ఫ్యామిలీని కంప్లీట్ గా అవైడ్ చేస్తోంది.

త‌న‌కు టాలీవుడ్ లో ఫస్ట్ హిట్ ని అందించిన హీరో ఫ్యామిలీతో పాటు హీరోని కూడా ప‌క్క‌న పెట్టేసింది. ఇప్పుడిది ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ద‌క్షిణాదికి చెందిన మరో ఇండ‌స్ట్రీ నుంచి తెలుగు చిత్ర సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌ద‌రు హీరోయిన్ రెండ‌క్ష‌రాల పేరు గ‌ల మూవీతో ప‌రిచ‌య‌మైంది. స‌ద‌రు హీరోకు, హీరోయిన్ కు ఈ మూవీ తిరుగులేని విజ‌యాన్ని అందించింది.

ఈ మూవీ కార‌ణంగానే స‌ద‌రు హీరోయిన్ తెలుగులో క్రేజీ స్టార్ల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ ని ద‌క్కించుకుంది. ఈ మూవీని హీరో ఫ్యామిలీనే స్వ‌యంగా నిర్మించారు. టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫ‌స్ట్ మూవీ స‌క్సెస్ త‌రువాత నుంచి స‌ద‌రు హీరోని, అత‌ని ఫ్యామిలీని హీరోయిన్ అనేక విష‌యాల్లో అవైడ్ చేస్తూ వ‌స్తోంది. ఇటీవ‌లే స‌ద‌రు హీరోయిన్ ప‌రిచ‌య‌మైన చిత్రం విడుద‌లై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు ఆ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ట్వీట్ చేశాడు.

అయితే స‌ద‌రు డైరెక్ట‌ర్ చేసిన ట్వీట్ ని ట్యాగ్ చేసిన హీరోయిన్ ఆ చిత్రంలో న‌టించిన హీరోని కానీ, ప్రొడ‌క్ష‌న్ కంప‌నీని కానీ ట్యాగ్ చేయ‌కుండా అవైడ్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. సినిమాకు మెయిన్ లీడ్ అయిన హీరోని, ప్రొడ్యూస‌ర్‌ని, ప్రొడ‌క్ష‌న్ కంప‌నీని ట్యాగ్ చేక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కి తావిస్తోంది. కావాల‌నే స‌ద‌రు హీరోని, హీరోయిన్ అవైడ్ చేస్తున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.