Begin typing your search above and press return to search.

మేన‌కోడ‌లిని బ‌రిలోకి దించేసిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   25 March 2021 5:30 PM GMT
మేన‌కోడ‌లిని బ‌రిలోకి దించేసిన స్టార్ హీరో
X
బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ మేనకోడలు అలీజే అగ్నిహోత్రి త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అవ్నిష్ బర్జాత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రంతో ఈ భామ‌ అరంగేట్రం చేయనుంది. అవనీష్ సూరజ్ బర్జాత్య కుమారుడు. ఇక ఇదే చిత్రంలో సన్నీ డియోల్ చిన్న కుమారుడు రాజ్ వీర్ ‌క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు.

ఈ చిత్రం డెస్టినేషన్ వెడ్డింగ్ నేప‌థ్యంలో రొమాంటిక్ కామెడీ క‌థాంశంతో రూపొంద‌నుంది. రణబీర్ కపూర్ - దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ రూపొందించిన `యే జవానీ హై దీవానీ` త‌ర‌హాలో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో ప‌లువురు కొత్త కుర్రాళ్ల‌కు .. యువ‌న‌టీన‌టులకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు.

స‌ల్మాన్ మేన‌కోడ‌లు అలీజే నేప‌థ్యం ఆస‌క్తిక‌రం. అతుల్ అగ్నిహోత్రి -అల్విరా ఖాన్ జంట గారాల‌ కుమార్తె. అతుల్ అగ్నిహోత్రి బాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌.. ద‌ర్శ‌క‌న‌టుడు అన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు తన కుమార్తె పెద్ద స్క్రీన్ అరంగేట్రం గురించి మాట్లాడుతూ..ఈ ప్రాజెక్టుపై ఇప్పుడే మాట్లాడ‌డం చాలా తొందరపాటు అవుతుంద‌ని అన్నారు. అలీజే న‌టిగా సిద్ధంగా ఉండాలి. త‌న‌కు బెస్ట్ ఇవ్వాలి అని అన్నారు.

నిజానికి అలీ జే ద‌బాంగ్ 3లో న‌టించాల్సింది. కానీ ఎందుక‌నో కుద‌ర‌లేదు. కానీ ఇప్పుడు డెబ్యూ నాయిక‌గా రంగ ప్ర‌వేశం చేసే టైమ్ వ‌చ్చింది. అగ్నిహోత్రి వార‌సులు ఇప్పటికే వారి కుటుంబాన్ని చలనచిత్ర వ్యాపారంలో పెద్ద స్థాయిలో నిల‌బెట్టారు. అందువల్ల వారికి ఇండ‌స్ట్రీపై అవ‌గాహ‌న ఉంది. ఒడిదుడుకుల గురించి బాగా తెలుసు. మార్కెట్ డైనమిక్స్ తెలుసు గ‌నుక అది అలీజే కెరీర్ కి ప్ల‌స్ అవుతుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.