Begin typing your search above and press return to search.

భార్య పుట్టిన‌రోజున స్టార్ హీరో అలా షాకిచ్చారు!

By:  Tupaki Desk   |   21 March 2021 9:16 AM GMT
భార్య పుట్టిన‌రోజున స్టార్ హీరో అలా షాకిచ్చారు!
X
భార్య పుట్టిన‌రోజున త‌న‌కు ఏకంగా ఫామ్ హౌస్ నే కానుకిచ్చారు ఆ స్టార్ హీరో. అంతేకాదు అదే ఫామ్ హౌస్ లో ఫ్యామిలీకి అదిరిపోయే పార్టీని ఇచ్చారు. ఇంత‌కీ కానుకిచ్చిన హీరో ఎవ‌రు? అంటే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. త‌న భార్య లక్ష్మీ ప్ర‌ణ‌తి మార్చి 18న బ‌ర్త్ డే జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా తార‌క్ ఖ‌రీదైన కానుక‌తో స్పెల్ బౌండ్ చేశారు. హైద‌రాబాద్ లో ఖ‌రీదైన ఏరియాలో ఉన్న‌ ఈ ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులంద‌రికీ మ‌ర‌పురాని కాస్ట్ లీ పార్టీని ఇచ్చారు తార‌క్.

ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి రాక‌తో త‌న లైఫ్ లో ప్ర‌తిదీ ఆనంద‌మ‌యంగా మారింది. అభ‌య్ రామ్ - భార్గ‌వ్ రామ్ అనే ఇద్ద‌రు కిడ్స్ ని బ‌హుమ‌తిగా ఇచ్చారు ప్ర‌ణ‌తి. ఆ ఇద్ద‌రూ గొప్ప‌ బ‌హుమ‌తులు అంటూ తార‌క్ ప్ర‌తిసారీ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. అందుకే ఇప్పుడు భార్య‌కు ధీటైన కానుకిచ్చారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. RRR చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి.. త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ తో సెట్స్ లో జాయిన్ కానున్నారు తార‌క్. కొత్త చిత్రం ఉగాది (ఏప్రిల్ 13) రోజున పూజా కార్య‌క్రమంతో ప్రారంభ‌మ‌వుతుంది. 2022 సంక్రాంతి రిలీజ్ ల‌క్ష్యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.