Begin typing your search above and press return to search.
అల్లుళ్ల సందడి వేసవిలో ఉండబోతుందంటున్న స్టార్ డైరెక్టర్..!!
By: Tupaki Desk | 23 Dec 2020 12:00 PM ISTగతేడాది విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లను హీరోలుగా.. తమన్నా, మెహరీన్ లను హీరోయిన్లుగా పెట్టి రూపొందించిన చిత్రం 'ఎఫ్2'. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం షూటింగ్ షురూ చేసి వేసవిలో వెంకీ, వరుణ్ లతో సందడి చేయించాలని అనిల్ భావిస్తున్నాడట. ఇటీవలే ఎఫ్-3 సీక్వెల్ లాంచింగ్ పూజా కార్యక్రమం కూడా పూర్తి చేశారు. అయితే వెంకీ ఓవైపు నారప్ప సినిమా చేస్తూనే ఎఫ్-3 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడట. ఈరోజు హైదరాబాదులో వేసిన ప్రత్యేక ఇంటి సెట్ లో పది రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్లో విక్టరీ వెంకీ షూట్ లో పాల్గొంటాడని, వరుణ్ తేజ్ కాస్త ఆలస్యంగా షూట్ లో పాల్గొంటాడని సమాచారం.
పది రోజుల అనంతరం వరుణ్.. అంటే వెంకటేష్ తోడల్లుడు జాయిన్ కాబోతున్నాడట. అయితే ఈ ఎఫ్3 అనేది ఎఫ్-2 కి సీక్వెల్ అని అంతా అనుకున్నారు. కానీ ముహూర్తం రోజే అనిల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ ఎఫ్-3 లో కొత్త నటులు ఎవరూ జాయిన్ అవ్వరని, అలాగే ఎఫ్-2 కి సీక్వెల్ కాదు.. డిఫరెంట్ మనీ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ సాగనుందని తెలిపాడు. మరి వేసవిలో థియేటర్లలో సందడి చేయిస్తానన్న అనిల్ ఆ టైంలోకి నిజంగా పూర్తి చేస్తాడేమో చూడాలి. ఇక ఎఫ్-2 తో భారీ లాభాలను వెనకేసుకున్న నిర్మాత దిల్ రాజు.. ఈసారి ఎఫ్-3 నిర్మాణం ఖర్చులో ఎలాంటి వెనకడుగు వేసేలా లేడని ఇండస్ట్రీ టాక్. ఇక ఓ వైపు హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. మెహరీన్ మాత్రం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉందని సినీవర్గాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.