Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ వార‌సుడి ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీకి రంగం సిద్ధం?

By:  Tupaki Desk   |   9 April 2022 3:30 PM GMT
ప‌వ‌ర్ స్టార్ వార‌సుడి ప‌వ‌ర్ ఫుల్ ఎంట్రీకి రంగం సిద్ధం?
X
హీరోల వార‌సులు వెండితెర‌పై ఎంట్రీ ఇస్తే చూడాల‌ని వారి అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. ఇప్ప‌డు అదే త‌ర‌హాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు కూడా ఆయ‌న వార‌సుడు అకిరా నంద‌న్ తెరంగేట్రం కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి త్వ‌ర‌లోనే ప‌వ‌ర్ స్టార్ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నారు. స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌బోతున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. వివ‌రాల్లోకి వెళితే... ఇటీవ‌ల 'భీమ్లానాయ‌క్‌' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

ఈ మూవీ త‌రువాత ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. 17వ వ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా బందిపోటుగా క‌నిపించ‌బోతున్నారు. మొఘ‌ల్ సామ్రాజ్యం కాలం నాటి కోహినూర్ వ‌జ్రం నేప‌థ్యంలో ఈ సినిమా ఆద్యంతం ఓ హలీవుడ్ సినిమా స్థాయిలో సాగ‌నుంద‌ట‌. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ కరోనా, ఒమిక్రాన్ ల కార‌ణంగా గ‌త కొన్ని నెల‌లుగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ద‌స‌రాకు రిలీజ్ చేయాలిన ప‌క్కా ప్లాన్ తో మేక‌ర్స్ ఈ మూవీ షూటింగ్ ని ఎట్ట‌కేల‌కు ఈ గురువారం హైద‌రాబాద్ లో ప్రారంభించారు. ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి ప‌ర్య వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేకంగా ఈ చిత్రం కోసం భారీ సెట్ ల‌ని నిర్మించారు. ఆ సెట్ ల‌లో కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ తో ఈ మూవీ షూటింగ్ ని ద‌ర్శ‌కుడు క్రిష్ ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌యుడు అకీరా నంద‌న్ న‌టించ‌బోతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో యంగ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గా అకీరా నంద‌న్ క‌నిపించ‌నున్నార‌ని, ప్ర‌స్తుతం ఈ పాత్ర‌లో న‌టించ‌డం కోసం అకీరా ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుంటున్నార‌ని వినిపిస్తోంది. అకిరాని ప‌వ‌న్ యంగ్ పాత్ర‌లో చూపించాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ కి మెరుపులాంటి ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌. ఆ ఆలోచ‌న‌ని వెంట‌నే ప‌వ‌న్ కు చెప్ప‌డం.. థాట్ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగిపోయాయ‌ని చెబుతున్నారు. ఈ వార్త తెలిసిన ప‌వ‌న్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌.

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుగా రాబిన్ హుడ్ త‌ర‌హా గ‌జ దొంగ పాత్ర‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్‌, కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ హాట్ లేడీ న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టిస్తున్నారు. ఇదిలా వుంటే ఇటీవ‌ల అకీరాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే. ఈ వీడియోని చూసిన వారంత‌ల అకిరా హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డం కోసం రెడీ అవుతున్నాడంటూ నెటిజ‌న్స్ కామెంట్ లు చేశారు.

అయితే ఈ కామెంట్ ల‌కు రేణు దేశాయ్ షాకింగ్ రిప్లై ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అకీరాకు న‌టుడిగా మారాల‌నే ఉద్దేశ్యం లేద‌ని, త‌ను అందు కోసం సిద్ధం కావ‌డం లేద‌ని స్ప‌ష్టం చేయ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో అకిరా 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' చిత్రంలో తెరంగేట్రం చేస్తున్నాడ‌న్న‌ది ఎంత వ‌ర‌కు నిజం అనేది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.