Begin typing your search above and press return to search.

రాంచరణ్ బర్త్ డే 'సెలెబ్రేషన్స్'కు రంగం సిద్ధమైంది..!

By:  Tupaki Desk   |   18 March 2021 9:34 AM GMT
రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్కు రంగం సిద్ధమైంది..!
X
సినీఇండస్ట్రీలో అభిమాన హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు సెలెబ్రేట్ చేసుకోవడం మాములే. కొన్నేళ్లుగా తమ ఫేవరేట్ హీరోల పుట్టినరోజును ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజును ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు రాంచరణ్ ఫ్యాన్స్.. రాంచరణ్ యువశక్తి బ్యాచ్ సిద్ధం అవుతోంది. అదికూడా మాములుగా కాదు. ఏకంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో మార్చ్ 26న జరుపనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు రాంచరణ్ తో పాటు పలువురు మెగాఫ్యామిలీ వారు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాంచరణ్ ఫ్యాన్స్ పుట్టినరోజు ఏర్పాట్లు మొదలు పెట్టేసారట. నిజానికి మార్చ్ 27న చరణ్ పుట్టినరోజు.

ఈ ఏడాది పుట్టినరోజుతో రాంచరణ్ ముప్పఆరో పడిలో అడుగు పెట్టనున్నాడు. అయితే రాంచరణ్ యువశక్తి గ్రూప్ ఇప్పటికే పేదలకు సాయం చేసే కార్యక్రమాలతో పాటు జనాలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక సేవలలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ సాయం అందిస్తున్న అభిమానుల కోసం రాంచరణ్ కూడా పుట్టినరోజును వారితో జరుపుకోవాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం రాంచరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తూనే మరోవైపు మెగాస్టార్ ఆచార్య సినిమాలో షూట్ ఫినిష్ చేసుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. గతేడాది రాంచరణ్ పుట్టినరోజు కానుకగా రాజమౌళి బృందం ఇంట్రడక్షన్ ప్రోమో రిలీజ్ చేసింది. మరి ఈసారి కూడా అలాంటిది ఏదైనా ఉందేమో చూడాలి!