Begin typing your search above and press return to search.

పంట చేతికొచ్చింది.. విజయానికి శ్రీకారం చుట్టినట్లేనా..!

By:  Tupaki Desk   |   3 March 2021 11:35 AM GMT
పంట చేతికొచ్చింది.. విజయానికి శ్రీకారం చుట్టినట్లేనా..!
X
వర్సటైల్ హీరో శ‌ర్వానంద్ - ప్రియాంక అరుళ్ మోహన్‌ జంటగా నటిస్తున్న ''శ్రీకారం'' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా రైతులు - వ్యవసాయం ప్రధానాంశాలుగా తీసుకుని కిశోర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట - గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. మహాశివరాత్రి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

సెన్సార్ బోర్డ్ వారు 'శ్రీకారం' చిత్రానికి క్లీన్ 'యూ' సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రాన్ని చూడటానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా 'పంట చేతికొచ్చింది!' అని పేర్కొంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ ని వదిలింది. ఇందులో రావు రమేష్ తో కలిసి శర్వానంద్ బైక్ పై వస్తున్నాడు. కాగా, 'శ్రీకారం' చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్‌ - మురళి శర్మ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు నటించారు. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్న శర్వా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.