Begin typing your search above and press return to search.
అక్కడ పరిస్థితి మరీ చేజారిపోతుంది
By: Tupaki Desk | 19 Aug 2021 7:00 AM ISTకరోనా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది అనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ పై కరోనా చూపించిన దెబ్బ ఎంత గట్టిగా ఉందో అందరికి తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లు గత ఏడాది నెలల తరబడి మూసుకునే ఉన్నాయి. ఇండియాలో కూడా పరిస్థితి అదే కొనసాగింది. అయితే అన్ని భాషల పరిశ్రమలతో పోల్చితే ఈ ఏడాది ఆరంభంలో తెలుగు సినిమా పరిశ్రమ కాస్త హడావుడి కనిపించింది. థియేటర్ల ద్వారా సినిమాలు విడుదల అయ్యి వంద కోట్లు అంతకు మించి వసూళ్లు దక్కించుకున్నాయి. కాని బాలీవుడ్ లో మాత్రం గత ఏడాది నుండి ఇప్పటి వరకు థియేటర్లలో సినిమాలు విడుదల అవ్వడమే గగనం అన్నట్లుగా పరిస్థితి ఉంది.
బాలీవుడ్ లో గత ఏడాది ఆరంభంలో పెద్దగా సినిమాలు ఏమీ లేవు. మద్యలో కరోనా బ్రేక్ ఇచ్చినా కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ కాకపోవడంతో పాటు సినిమా లు విడుదలకు ఓపెన్ గా లేకపోవడం.. ఇలా అనేక కారణాల వల్ల బాలీవుడ్ సినిమా లు బాక్సాఫీస్ వద్దకు వచ్చేందుకు సిద్దంగా లేకుండా పోయాయి. ఈ ఏడాది ఆరంభంలో పెద్దగా హడావుడి లేదు. ఈ నెల నుండి అయినా కాస్త హడావుడి ఉంటుందంటే థర్డ్ వేవ్ భయంతో మళ్లీ సినిమా థియేటర్ల పై ఆంక్షలు పెట్టారు. ఆ కారణంగా బాలీవుడ్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా వాయిదా పడుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు ఓటీటీ దిక్కు అన్నట్లుగా విడుదలకు సిద్దం అవుతున్నాయి. బాలీవుడ్ సల్మాన్ ఖాన్.. అక్షయ్ కుమార్ ఇంకా ప్రముఖుల సినిమాల సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. హిందీ ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్ల కు రావడం లేదు అనే టాక్ ఉంది. పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో వస్తే ఇక థియేటర్లకు జనాలు వస్తారు అనే నమ్మకం పోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ సినిమా విడుదల చేయడం కోసం డేట్ అనౌన్స్ చేసి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చారు. కాని మళ్లీ విడుదల క్యాన్సిల్ అయ్యింది. దాంతో బాలీవుడ్ లో ముందు ముందు మరింతగా థియేటర్ల కు గడ్డు కాలం వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో కనీసం ఒక్క పెద్ద సినిమా అయినా బాలీవుడ్ నుండి వస్తుందా అంటే ఖచ్చితంగా డౌటే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు.