Begin typing your search above and press return to search.

ఆలియాకు కరోనా వచ్చినా షూటింగ్ మాత్రం డిలే అవదు: 'RRR' టీమ్

By:  Tupaki Desk   |   2 April 2021 11:00 PM IST
ఆలియాకు కరోనా వచ్చినా షూటింగ్ మాత్రం డిలే అవదు: RRR టీమ్
X
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. అలియా భట్ -ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు వాయిదాల తర్వాత చివరగా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా జక్కన్న షూటింగ్ ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. అయినప్పటికీ అనుకున్న సమయానికి చిత్రీకరణ జరగడం లేదని.. మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఆలియాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో ట్రిపుల్ ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం కావడం ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఆలియాకు కోవిడ్-19 వచ్చినా షూటింగ్ మాత్రం డిలే అవదని 'RRR' టీమ్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ''ఆలియాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది కదా. మరి షూట్‌ ఏమైనా డిలే అయ్యే అవకాశముందా?'' అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ 'నో.. కానే కాదు' అని సమాధానమిచ్చింది. దీనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన సమయానికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా వర్క్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. కాగా, ఆర్ ఆర్.ఆర్ లో కొమురం భీమ్ గా తారక్.. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని ట్రేడ్ టాక్. మరి ఈ చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విజయదశమి వరకు ఆగాల్సిందే.