Begin typing your search above and press return to search.

సామ్ కి పోటీగా చైని న‌డిపిస్తున్న తెర‌వెన‌క షాడో!

By:  Tupaki Desk   |   31 July 2022 5:27 AM GMT
సామ్ కి పోటీగా చైని న‌డిపిస్తున్న తెర‌వెన‌క షాడో!
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట బ్రేక‌ప్ గురించి తెలిసిందే. బ్రేక‌ప్ అనంత‌రం ఎవ‌రికి వారు పూర్తిగా త‌మ కెరీర్ పైనే దృష్టి సారించారు. స‌మంత జెట్ స్పీడ్ తో పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అందుకుంది. ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో రాజీ పాత్ర‌తో దూసుకెళ్లింది. అటుపై పుష్ప చిత్రంలో ఊ అంటావా ఐట‌మ్ సాంగ్ త‌న‌ని నార్త్ లో మాస్ కి యూత్ కి చేరువ చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో నాలుగైదు చిత్రాల‌కు స‌మంత సంత‌కాలు చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. సామ్ ఇటీవ‌లే క‌ర‌ణ్ జోహార్ కాఫీ విత్ క‌ర‌ణ్ లో క‌నిపించాక త‌న క్రేజ్ మ‌రింత పెరిగింది. త‌న హిందీ కెరీర్ ఎదుగుద‌ల కోసం స‌మంత ముంబైలో త‌న పీఆర్ టీమ్ కి భారీ ప్యాకేజీని ముట్ట‌జెబుతోంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే స‌మంత‌కు ధీటుగా ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా ఎద‌గాలి అంటే ఏం చేయాలి? ప్ర‌స్తుత కాంపిటీష‌న్ లో న‌ట‌వార‌స‌త్వం (నెపోటిజం)తో సంబంధం లేకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరో పాన్ ఇండియా గుర్తింపుతో దూసుకుపోతున్నాడు. ఇత‌ర యువ‌హీరోలు కూడా ఇరుగు పొరుగున పాపుల‌రైపోతున్నారు. ముఖ్యంగా మ‌న స్టార్లు అంతా హిందీ మార్కెట్ పై ఫోక‌స్ చేశారు. అదే క్ర‌మంలో నాగ‌చైత‌న్య రేంజ్ ఎక్క‌డ ఆగింది? అన్న చ‌ర్చ అక్కినేని అభిమానుల్లో విస్త్ర‌త‌మ‌వుతోంది. అత‌డు హిందీ ప‌రిశ్ర‌మ‌పైనా ఫోక‌స్ చేసి త‌న మార్కెట్ రేంజును పెంచుకోవాల్సిన సంద‌ర్భం వ‌చ్చింద‌న్న చర్చా సాగుతోంది.

అయితే దీనికి `లాల్ సింగ్ చద్దా`తో అంకురార్ప‌ణ చేసారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తోంది. నాగ చైతన్య వెన‌క అమీర్ ఖాన్ షాడో పాత్ర‌ను పోషిస్తున్నారు. చైని వీలున్నంత మేర అన్ని వేదిక‌ల‌పైనా ప్ర‌శంసిస్తూ అత‌డికి బోలెడంత బూస్ట్ ఇస్తున్నాడు. చై విష‌యంలో అమీర్ ఖాన్ ఎంత ఉదారంగా ఉన్నాడనే దాని గురించి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సమంతా రూత్ ప్రభుతో విడాకులు తీసుకున్న తర్వాత చైతూకి కొత్త దారి చూప‌డానికి అతను సహాయం చేస్తున్నాడని ప్ర‌చారం సాగుతోంది.

లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ ప్ర‌స్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2022 చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి ఈవెంట్ లో నాగ చైతన్య గురించి అమీర్ ఖాన్ ఎలా బూస్ట్ ఇస్తున్నారో మీడియా క‌థ‌నాల్లోనూ ప్ర‌స్థావ‌న‌కు వ‌స్తోంది. నాగ చైతన్య -సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అమీర్ ఖాన్ హైద‌రాబాద్ కి వచ్చినప్పుడు వేదిక‌పై చై గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. చై తల్లిదండ్రుల‌ పెంపకం గురించి అతను ప్రశంసల్లో ముంచెత్తాడు. నాగ చైతన్య చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని అన్నారు. నాగ చైతన్య - సమంతా రూత్ ప్రభు విడాకుల‌ను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఇది జరిగింది. #ChaySam వివాహంలో ఏమి తప్పు జరిగిందనే దానిపై ఊహాగానాలు బలంగా సాగుతున్న క్ర‌మంలో అమీర్ మాట‌లు ప్ర‌జ‌ల మైండ్ లోకి బాణాల్లా దూసుకెళ్లాయి. అమీర్ ఖాన్ బహిరంగ వేదికపై నాగ చైతన్యను ప్రశంసించ‌డం జ‌నం దృష్టిని మళ్లించడమేనని ప్రజలు భావించారు. నిజానికి నాగార్జునకు అమీర్ ఖాన్ మంచి స్నేహితుడు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ కోసం వ‌చ్చిన అత‌డు అక్కినేని కుటుంబంతో కలిసి డిన్నర్ చేసాడు.

ఇటీవ‌ల `లాల్ సింగ్ చద్దా` ప్రమోషన్స్ సమయంలో కూడా చై గురించి అమీర్ ప్ర‌శంస‌ల‌ను స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో ఉంది. ఇక్కడ లాల్ సింగ్ చడ్డా బృందంలోని హెయిర్ డ్రెస్సర్ అయినా లేదా మేకప్ పర్సన్ అయినా నాగ చైతన్యను ప్రశంసించడం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చై ప్ర‌తిభ గురించి ప్ర‌శంసిస్తున్నారు. చైతూ త‌న బాలీవుడ్ అరంగేట్రం కోసం అంత పెద్ద‌ సూపర్ స్టార్ నుండి ఎలాంటి మద్దతు పొందుతున్నాడు? అన్న‌దానికి ఈ ఉదాహ‌ర‌ణ‌లు చాలు.

ఇంత‌లోనే నాగ చైతన్య ఇమేజ్ ఇటీవ‌ల‌ పెరుగుతోందంటూ సోషల్ మీడియాల్లో డిబేట్లు మొద‌ల‌య్యాయి. విడాకుల తర్వాత చైతూ గురించి ఎక్కువ చ‌ర్చ సాగింది. కానీ త‌న‌ ఇమేజ్ ను దెబ్బతీసే అపవాదులేవీ అత‌డిని చుట్టుముట్ట‌లేదు. గత కొన్ని నెలలుగా శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తూ వార్తలు వ‌చ్చినా కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. తన భార్య సమంత రూత్ ప్రభుతో విడాకులు తీసుకునేలా నాగ చైతన్యను ప్రోత్సహించినందుకు అమీర్ ఖాన్ ను వివాదాస్ప‌ద బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే తప్పుపట్టాడు. దానికి అత‌డిని నిందిస్తూ నెటిజ‌నులు కామెంట్లు చేయ‌డం క‌నిపించింది.