Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ 30కి త్రివిక్రమ్ హీరోల సెంటిమెంట్ కంటిన్యూ
By: Tupaki Desk | 27 April 2020 1:28 PM ISTఅల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తదుపరి చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ 30 సినిమాను త్రివిక్రమ్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ కరోనా లాక్ డౌన్ లేకుండా ఉండి ఉంటే జూన్ లేదా జులై నెలల్లో ఎన్టీఆర్ 30 చిత్రం సెట్స్ పైకి వెళ్లేది. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తంను త్రివిక్రమ్ పూర్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నటీనటుల నటన దాదాపుగా పూర్తి అయ్యిందట.
అజ్ఞాతవాసి నుండి మొదలుకుని మొన్నటి అల వైకుంఠపురంలో వరకు కూడా త్రివిక్రమ్ యంగ్ హీరోలను తన సినిమాలో లీడ్ రోల్ కు ఎంపిక చేస్తూ వస్తున్నాడు. అజ్ఞాతవాసి చిత్రంలో ఆది పినిశెట్టి నటించగా అరవింద సమేత చిత్రంలో యంగ్ హీరో నవీన్ చంద్ర నటించాడు. ఇక అల వైకుంఠపురంలో సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఎన్టీఆర్ 30 చిత్రంలో కూడా కీలక పాత్ర కోసం ఇద్దరు ముగ్గురు యంగ్ హీరోలను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నాడట.
లాక్ డౌన్ తర్వాత షూటింగ్ కు వెళ్లే సమయంను బట్టి హీరోను ఫైనల్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని త్రివిక్రమ్ ఆ యంగ్ హీరోను నిర్ణయించే అవకాశం ఉంది. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ మూవీలో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రంను ముందే వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఆలస్యం అవ్వడం వల్ల తేదీ ఏమైనా మరేనో చూడాలి. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ మరియు కళ్యాణ్ రామ్ లు కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నారు.