Begin typing your search above and press return to search.

దిద్దుబాటు మొద‌లుపెట్టిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్‌ ?

By:  Tupaki Desk   |   26 April 2022 1:30 AM GMT
దిద్దుబాటు మొద‌లుపెట్టిన సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్‌ ?
X
టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూస‌ర్ గా, బిగ్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ గా ఆయ‌న‌కు మంచి పేరుంది. సినిమా విష‌యంలో ఆయ‌న జ‌డ్జిమెంట్ కు తిరుగులేదు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారీ బ‌ల్ఆక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించారు. తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచిన చిత్రాల‌ని హిందీలోనూ రీమేక్ చేసి అక్క‌డ కూడా సంచ‌ల‌నాలు సృష్టించారు. అంతే కాకుండా తెలుగులో చాలా ఏళ్లుగా ఆయ‌న జ‌డ్జిమెంట్ కు తిరుగులేదు. క‌వ్విక్ష‌న్ తో భారీ చిత్రాల‌ని నిర్మించి బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా మ‌లిచిన స్టార్ ప్రొడ్యూస‌ర్ ఆయ‌న‌.

అయితే ఇటీవ‌ల ఆయ‌న జ‌డ్జిమెంట్ కాస్తా గాడి త‌ప్పింది. బ్యాక్ టు బ్యాక్ ఆయ‌న నిర్మాత‌గా వ్యవ‌హ‌రించిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టేశాయి. అంతే ఈ రెండు చిత్రాల‌కు ఆయ‌న ప్ర‌మోయం మాత్రం ఎంత మాత్రం లేదు. కేవ‌లం ఆయ‌న పేరుని మాత్ర‌మే వాడి ఒక సినిమాని ఆయ‌న ఫ్యామిలీ మెంబ‌ర్ ఒక‌రు నిర్మించారు. ఇక మ‌రో సినిమాకు ఆయ‌న నిర్మాత‌ల‌లో ఒక‌రిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ రెండు చిత్రాలు ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాపులుగా నిలిచి భారీ న‌ష్టాల‌ని అందించాయి.

కార‌ణంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ ని ప‌క్క‌న పెట్టి ఆయ‌న పేరుని మాత్రం వాడుకుంటూ ఆయ‌నొక ఔట్ డేటెడ్ ప్రొడ్యూస‌ర్ గా ట్రీట్ చేస్తూ ఫ్యామిలీ మెంబ‌ర్ స్వ‌తంత్రంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఆ కార‌ణం వ‌ల్లే స్టార్ ప్రొడ్యూస‌ర్ త‌న ప్ర‌మేయం లేకుండానే బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ఫ్లాపుల్ని త‌న ఖాతాలో వేసుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఈ సినిమాల ఫ‌స్ట్ కాపీ చూసి ఇవి ఖ‌చ్చితంగా ఫ్లాప్ అవుతాయ‌ని స‌ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్ చెప్పినా ఆయ‌న త‌న‌యుడు విన‌లేద‌ని, కావాల‌నే ఆయ‌న‌ని ప‌క్క‌న పెట్టి మ‌రీ సినిమాలు చేసి చేతులు కాల్చుకోవ‌డ‌మే కాకుండా అందుకు బాధ్యుడిగా స్టార్ ప్రొడ్యూస‌ర్ ని కార్నర్ చేశాడ‌ని చెబుతున్నారు.

సినిమా స్క్రిప్ట్ ల విష‌యంలో సినియ‌ర్ ప్రొడ్యూస‌ర్ తీసుకున్న తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల స్టార్ ప్రొడ్యూస‌ర్ కు రెండు సినిమాలు ఫ్లాప్ అనే ముద్ర ప‌డింద‌ని, ఆయ‌న ఇన్నాళ్లుగా బిల్డ్ చేసుకున్న క్రెడిబిలిటీ పోయింద‌ని ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా వుంటే స్టార్ ప్రొడ్యూస‌ర్ త‌న పేరుకు జ‌రిగిన డ్యామేజీకి దిద్దుబాటు మొద‌లు పెట్టార‌ట‌. ఇటీవ‌ల త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి గ‌ట్టి క్లాస్ పీకార‌ట‌.

అంతే కాకుండా యార‌గెంట్ గా కాకుండా బ్రిలియంట్ గా ఆలోచించాల‌ని, లాజిక‌ల్ గా ఆలోచించి మాత్ర‌మే క‌థ‌ల‌ని ఎంచుకోవాల‌ని, క్రియేటివ్‌, ఫైనాన్షియ‌ల్ విష‌యాల్లో తొంద‌ర పాటు ప‌నికి రాద‌ని, ఈ విష‌యంలో ఒక‌టికి ప‌ది సార్లు ఆలోచించి అడుగులు వేయాని త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి గ‌ట్టిగా క్లాస్ పీకార‌ట‌. అంతే కాకుండా చాలా సీరియ‌స్ టోన్ లో త‌న ఫ్యామిలీ మెంబ‌ర్ ని సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ తీవ్రంగా హెచ్చిరించిన‌ట్టుగా తెలుస్తోంది.