Begin typing your search above and press return to search.
సీనియర్ హీరోయిన్ కూడా పాన్ ఇండియా మూవీ
By: Tupaki Desk | 1 Oct 2020 9:45 AM ISTకర్ణాటకకు చెందిన సీరియల్ కిల్లర్ సైనైడ్ మోహన్ దాదాపు 20 మందిని వివాహం చేసుకుని వారిని వరుసగా చంపుతూ వచ్చాడు. వారికి సైనైడ్ పిల్స్ ఇచ్చి వారిని చంపినట్లుగా నిరూపితం అవ్వడంతో అతడికి శిక్ష కూడా పడింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సైనైడ్ మోహన్ విషయంను వెండి తెరపై చూపించేందుకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాజేష్ టోర్చ్ రివర్ రెడీ అయ్యాడు. సైనైడ్ అనే టైటిల్ తో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాలో కీలక పాత్రను సీనియర్ హీరోయిన్ ప్రియమణి పోషించింది.
సైనైడ్ సినిమాను కన్నడం.. తెలుగు.. మలయాళం.. తమిళం మరియు హిందీల్లో కూడా విడుదల చేయబోతున్నట్లుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా గుర్తింపు ఉన్న కథ అవ్వడం వల్ల అన్ని భాషల్లో కూడా తప్పకుండా ప్రేక్షకుల్లోకి ఈ సినిమా వెళ్తుందని భావిస్తున్నారు. దానికి తోడు ప్రియమణి తెలుగు.. తమిళం.. హిందీ ఇలా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. అందుకే అన్ని భాషల్లో కూడా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. సైనైడ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ప్రియమణి కనిపించబోతుందట. త్వరలో ఇతర నటీనటులను దర్శకుడు రాజేష్ ప్రకటించనున్నారు.