Begin typing your search above and press return to search.

తెలుగు ప్రెస్‌ కి ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్న సీనియర్ హీరో..!

By:  Tupaki Desk   |   14 May 2021 3:30 AM GMT
తెలుగు ప్రెస్‌ కి ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్న సీనియర్ హీరో..!
X
తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సీనియర్ హీరో.. అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోలకు పోటీనిచ్చే స్థాయికి చేరుకున్నారు. మార్షల్ ఆర్ట్స్‌ లో కూడా ప్రావీణ్యం ఉండటంతో ప్రేక్షకులు అతన్ని యాక్షన్ హీరోగా గుర్తించారు. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అతని లైఫ్ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. 1988లో బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్‌ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆయనపై ఏకంగా గూంఢా యాక్ట్ పెట్టి జైలుకు పంపడంతో ఎవరో కావాలనే అతని ఎదుగుదల చూడలేక కుట్ర చేసి జైలుకి పంపారనే అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ.. ఒకప్పటి తన స్నేహితుడు దివాకర్ వల్ల జైలుకి వెళ్లాల్సి వచ్చిందని.. గూండా యాక్ట్‌ పెట్టడంతో అంతకు ముందు ఇలాంటి కేసులు రిఫరెన్స్‌ లేకపోవటంతో క్లీన్‌ చీట్‌ రావాడానికి చాలా సమయం పట్టిందని.. చివరకు ఆ ఆరోపణలు అబద్ధాలేనని తేలిపోయిందని చెప్పుకొచ్చారు.

అలానే ఓ సందర్భంలో సుమన్ మాట్లాడుతూ ''ఆ సమయంలో తెలుగు ప్రెస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ కొంతమంది ప్రముఖులు నా తరపున మాట్లాడారు. నా క్యారక్టర్ ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి ఓ ప్రముఖ పత్రికకు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ పత్రిక వాళ్ళు చెప్పిన దాన్ని తమిళ మరియు తెలుగు భాషలలో రెండు వెర్షన్లను ప్రచురించింది. తెలుగులో నాకున్న క్రేజ్ గురించి అప్పుడు తమిళ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. నేను ఒక సాధారణ హీరో అని, ఏదో చిన్న సినిమాలు చేస్తున్నానని వారు అనుకున్నారు కానీ నా పాపులారిటీ గురించి తెలియదు. అయితే ఇక్కడి ప్రముఖులు చెప్పినవి ఆ పత్రిక ప్రచురించడం వల్ల నాకు తమిళ ప్రేక్షకుల్లో కూడా మంచి రీచ్ వచ్చింది. ప్రెస్ కవరేజ్ నాకు ఎంతో హెల్ప్ అయింది. దానికి నేను ఎప్పటికీ తెలుగు ప్రెస్‌ కి రుణపడి ఉంటాను'' అని పేర్కొన్నారు.