Begin typing your search above and press return to search.

చ‌ర‌ణ్ ని వెంబ‌డిస్తున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్?

By:  Tupaki Desk   |   4 April 2021 9:00 PM IST
చ‌ర‌ణ్ ని వెంబ‌డిస్తున్న సీనియ‌ర్ డైరెక్ట‌ర్?
X
ఒక‌దాని వెంట ఒక‌టిగా పాన్ ఇండియా సినిమాల‌తో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌హా ప్లానింగుతో దూసుకుపోతుంటే అత‌డిని ఓ లోక‌ల్ స్టార్ డైరెక్ట‌ర్ వెంట‌ప‌డి మరీ షంటేస్తున్నార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌మౌళితో ఆర్.ఆర్.ఆర్ పూర్తి చేయ‌గానే శంక‌ర్ తో సినిమా మొద‌లు పెట్టాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నారు. వ‌రుస‌గా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల‌తో త‌న స్థాయిని పెద్ద‌గా ఆవిష్క‌రించుకోవాల‌ని పోటీబ‌రిలో త‌న పొజిష‌న్ ని మ‌రో మెట్టు ఎక్కించాల‌ని త‌ప‌న‌ప‌డుతున్నారు.

అయితే మ‌ధ్య‌లో ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు చెర్రీ వెంట‌ప‌డుతున్నార‌ని తెలిసింది. అత‌డు క‌థ‌ను ఓకే చేయించుకోవాల‌ని తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌. రాజ‌మౌళి.. శంక‌ర్ తో పాటు చ‌ర‌ణ్ క్యూలో జెర్సీ ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఆయ‌న చెప్పే క‌థ‌కు చ‌ర‌ణ్ ఓకే చెబుతారా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది. ఇక‌పై అంతా పాన్ ఇండియా సినిమాల‌దే రాజ్యం. ఎంచుకునే క‌థాంశాలు .. ద‌ర్శ‌కులు కూడా ఆ రేంజులోనే ఉండాలి. ఇలాంట‌పుడు పాత చింత‌కాయ ఆలోచ‌న‌ల‌తో వ‌ర్క‌వుట‌వుతుందా? అన్న సందిగ్ధ‌త జ‌నంలో ఉంది. పాన్ ఇండియా రేస్ లో ప్ర‌భాస్.. బ‌న్ని.. తార‌క్ తో ప‌టీప‌డుతూ చ‌ర‌ణ్ గేమ్ ని ప్లాన్ చేస్తున్నార‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి.