Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ టోన్డ్ ఫిట్ లుక్ వెన‌క ర‌హ‌స్య‌మిదే

By:  Tupaki Desk   |   29 Jun 2021 4:08 PM IST
బుట్ట‌బొమ్మ టోన్డ్ ఫిట్ లుక్ వెన‌క ర‌హ‌స్య‌మిదే
X
టాలీవుడ్ బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ మోస్ట్ వాంటెడ్ క‌థానాయిక‌గా పాపుల‌రైన బ్యూటీ పూజా హెగ్డే. ప్ర‌స్తుతం ఈ ముంబై బ్యూటీ లాక్ డౌన్ అనంత‌రం క్ష‌ణం తీరిక లేని షెడ్యూళ్ల‌తో బిజీ అవుతోంది.

ఇంత బిజీలో ఉన్నా వ‌ర్క‌వుట్ సెష‌న్స్ ని మాత్రం అస్స‌లు మిస్ చేయ‌దు. రెగ్యుల‌ర్ గా జిమ్.. యోగా.. పైలేట్స్ క్లాసెస్ ని అస్స‌లు విడిచిపెట్ట‌దు. ఇక పూజా వ‌ర్క‌వుట్ సెష‌న్స్ సోష‌ల్ మీడియాల్లో అంతే
వైర‌ల్ గా దూసుకెళుతున్నాయి.

పూజా ఇన్ స్టాలో ఎక్కువగా యోగాసనాలతో అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన యోగాస‌నాల్లో చ‌క్రాస‌నం స‌హా సూర్య న‌మ‌స్కార భంగిమ‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఇక పూజా ప‌ర్ఫెక్ట్ స్పోర్ట్ లుక్ తో యోగా ప్రాక్టీస్ చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

పూజా క‌థానాయిక‌గా న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ రిలీజ్ ల‌కు రావాల్సి ఉంది. రాధేశ్యామ్ పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ఇటీవ‌లే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో సిర్క‌స్ అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌సన కబీ ఈద్ కబీ దీపావళి అనే చిత్రంలో న‌టిస్తోంది. అటు త‌మిళంలో ద‌ళ‌ప‌తి 65 బీస్ట్ లోనూ క‌థానాయిక‌గా అవ‌కాశం న‌టిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వ‌హిస్తున్నారు.