Begin typing your search above and press return to search.

కాజ‌ల్ ని అంత‌గా భ‌య‌పెట్టిన స్కేరీ ఘ‌ట‌న‌!

By:  Tupaki Desk   |   26 Jan 2021 5:30 AM GMT
కాజ‌ల్ ని అంత‌గా భ‌య‌పెట్టిన స్కేరీ ఘ‌ట‌న‌!
X
కొన్ని అవ‌కాశాలు అరుదుగానే వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన వాటిని స‌ద్వినియోగం చేసుకుంటే అటుపై ఆఫ‌ర్ల ప‌రంగా కొద‌వేమీ ఉండ‌దు. ప్ర‌స్తుతం ఓటీటీ-డిజిట‌ల్ వేదిక ఔట్ డేటెడ్ స్టార్లకే కాదు లైవ్ లో యాక్టివ్ గా ఉన్న స్టార్ల‌కు కూడా అవ‌కాశాల్ని పెంచుతోంది. స‌మంత కాజ‌ల్ త‌మ‌న్నా అమ‌లాపాల్ ఇషా రెబ్బా లాంటి అందాల క‌థానాయిక‌లు డిజిట‌ల్ తెర‌పై ప్ర‌త్య‌క్ష‌మై స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది ఇందుకే.

తొలిగా స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగుకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించారు. తాజాగా కాజల్ అగర్వాల్ న‌టిస్తున్న `లైవ్ టెలికాస్ట్` స్ట్రీమింగుకి సిద్ధ‌మవుతోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 12 న డిస్నీ ప్ల‌స్ హాట్ ‌స్టార్ విఐపి లో ప్రీమియర్ల కు సిద్ధ‌మ‌వుతోంది.

కాజల్ లైవ్ టెలికాస్ట్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో తెర‌కెక్కింది. ఇది స‌మంత న‌టించిన తీవ్ర‌వాదం బ్యాక్ డ్రాప్ సిరీస్ కి పూర్తి భిన్న‌మైన‌ది. ఒక ర‌కంగా కీర్తి సురేష్ న‌టించిన పెంగ్విన్ త‌ర‌హా అనే చెప్పాలి. అయితే హార‌ర్ జోన‌ర్ పెంగ్విన్ కంటే విభిన్నంగా ఏం ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. లైవ్ టెలీకాస్ట్ సిరీస్ ‌లో వైభవ్ .. ఆనంది త‌దిత‌రులు కాజ‌ల్ తో పాటు క‌నిపిస్తారు. ఈ సిరీస్ లో వేరే కొత్త‌ కాజల్ ను చూపిస్తానని దర్శకుడు హామీ ఇచ్చారు కాబ‌ట్టి.. రొటీన్ కి భిన్నంగా కాజ‌ల్ ఏం చూపిస్తుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

లైవ్ టెలికాస్ట్ అనేది పది-ఎపిసోడ్ ల‌ సిరీస్. పారానార్మల్ యాక్టివిటీస్ త‌ర‌హాలో ట్రై చేస్తున్నార‌ట‌. ప్రీమియర్ ప్రకటన పోస్టర్ ‌లో కాజల్ త‌న టీమ్ తో క‌లిసి ఉంది. ఈ బృందం భయపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులోనే కాజ‌ల్ లోని మ‌రో కోణం ఏమిట‌న్న‌ది ఇప్ప‌టికి స‌స్పెన్స్. ఆచార్య- మోసగాళ్లు - భార‌తీయుడు 2- ముంబై సాగా లాంటి భారీ చిత్రాల్లోనూ కాజ‌ల్ న‌టిస్తోంది. వీటికి భిన్నంగా వెబ్ సిరీస్ ద్వారా భ‌య‌పెట్టేందుకు కాజ‌ల్ సిద్ధ‌మ‌వుతోంది.