Begin typing your search above and press return to search.
థియేటర్లు తెరిచినా అదే పరిస్థితి: సినీవర్గాల చర్చ
By: Tupaki Desk | 19 May 2020 9:15 AM ISTకరోనా దెబ్బకు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా మసకబారిపోయింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో యజమానులు తీవ్ర నష్టాలలో మునిగిపోయారు. నిజానికి వేసవి సీజన్‌లో వచ్చే లాభాలతోనే ఏడాదంతా థియేటర్లు నడపగలుగుతున్నామని, ఈ సమయంలోనే సమస్య తలెత్తడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని థియేటర్ల ఓనర్లు అంటున్నారు. లాక్‌డౌన్ ఎత్తేసినా కొంతమంది థియేటర్లను తెరిచే అవకాశం కనిపించడం లేదంటున్నారు. థియేటర్ నిర్వహణకు నెలకు రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకూ ఖర్చవుతుంది. సాధారణ రోజుల్లో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటుంది.. కాబట్టి, వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు సరిపోతుంది. సంక్రాంతి, దసరా సీజన్లలో కొత్త సినిమాల విడుదలతో పరిస్థితి కాస్త బాగానే ఉంటుంది.
ఆ రెండు సీజన్‌లతో పోల్చితే మార్చి నెల చివర నుంచి జూన్ నెల ముగిసే వరకూ థియేటర్‌లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వేసవిలోనే థియేటర్ల యజమానులకు మంచి లాభాలు వస్తాయి. ఆ మొత్తంతోనే ఏడాది మొత్తం థియేటర్లను నడుపుతుంటామని చెప్తున్నారు. అందుకే థియేటర్ల నిర్వాహకులు వేసవి సీజన్‌పై భారీ ఆశలు పెట్టుకుంటారు. అయితే లాక్ డౌన్ తర్వాత.. ఒకవేళ సినిమా థియేటర్లు పునఃప్రారంభం అయినా ప్రేక్షకుల సంఖ్య విషయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అంతేగాక ప్రేక్షకులు కూర్చునే విషయంలో కూడా పలు మార్పులు చేయాలనీ పలువురు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.
ఓ ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే దగ్గర కూర్చోబెట్టడం.. సింగిల్స్ లేదా వేరే వాళ్లను మరో చోట కూర్చోబెట్టే కొత్త మార్పులు థియేటర్లలో వస్తే వస్తాయని అంటున్నారు. అంతే కాకుండా ధియేటర్లు తెరుచుకోగానే కొత్త సినిమాలన్నీ విడుదల అవ్వడానికి క్యూ కడతాయి. ఇక అన్ని సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫాం పై విడుదల చేయడం అంత తేలికైన పనికాదు. ఇక తాజాగా సినిమాల విడుదల విషయంలో పీవీఆర్ పిక్చర్స్ వారు ఒక ప్రకటన చేశారు. ఎంతోమంది నిర్మాతలు.. తమ సినిమాలను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట. తర్వాత పివిఆర్ పిక్చర్స్ సిఇఒ కమల్ మాట్లాడుతూ.. "చిత్ర నిర్మాతల కష్టం.. టాలెంట్ తెలియాలంటే.. సినిమాలను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయడం ఉత్తమ మార్గం' అన్నారు. మరి త్వరలో ఏదైనా తీపి కబురు అందుతుందేమో చూడాలి!