Begin typing your search above and press return to search.
రూపాయి కాయిన్ నన్ను నటిగా మార్చింది - ప్రీతీ జింటా
By: Tupaki Desk | 2 Feb 2021 3:00 PM IST‘ప్రీతి జింటా..’ ఈమె నటనకన్నా ముందుగా ఆమె సొట్ట బుగ్గలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు! తన చెక్కిళ్లను చూసి మనసు పారేసుకున్న కుర్రోళ్లకు లెక్కేలేదనే మాట ఎంతమాత్రమూ అతికాదు. అందానికి, అద్భుతమైన అభినయాన్ని జోడించి బాలీవుడ్ ను ఓ ఊపు ఊపింది ప్రీతి. అయితే.. తనను సినిమాల్లోకి తీసుకొచ్చింది మాత్రం ఒక రూపాయి కాయిన్ అని చెబుతోందీ సొట్టబుగ్గల సుందరి.
ప్రీతి జింటా 47వ వసంతంలోకి అడుగు పెట్టింది. మొన్నటి జనవరి 31తోనే ఆమెకు 46 ఏళ్లు నిండాయి. బాలీవుడ్‌లో టాప్ స్టార్ గా ఎదిగిన తర్వాత.. అంట్రప్రెన్యూర్‌గా మారిన ప్రీతి, తను సినిమాల్లోకి ఎలా వచ్చానో వివరించింది. ‘లిరిల్’ సోప్ యాడ్ చేసి లిరిల్ గర్ల్‌గా క్రేజ్ సంపాదించుకున్న ప్రీతి.. సినిమాల్లో ఏ విధంగా సత్తా చాటిందో అందరికీ తెలిసిందే.
అయితే.. ఆమె జీవితం పూలపాన్పుగా ఏమీ లేదు మొదట్లో. ఆమె తండ్రి చిన్నప్పుడే మరణించడంతో కుటుంబ భారం మొత్తం తనపైనే పడింది. దీంతో.. ఈ సిమ్లా యాపిల్ త్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ముంబై చేరుకుంది. అక్కడ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టడంతో సహజంగానే బాలీవుడ్ కన్ను పడింది.
అప్పటి టాప్ డైరెక్టర్ శేఖర్ కపూర్ తనను చూసి ‘తర రమ్ పమ్’ సినిమా కోసం అప్రోచ్ అయ్యారట. ఆయన ఆఫర్ విని నోరెళ్లబెట్టిందట ప్రీతి. ‘నేను ఆయన్ను చూసి నోరు తెరిచాను. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద దర్శకుడు. అయితే.. నాకు సినిమా కెరీర్ పట్ల అప్పటికి పెద్ద ఆలోచన లేదు. విధి నిర్ణయం ఎలా ఉంటే అలా చేస్తానని ఆయనతో చెప్పాను. ఆయన ఎదురుగానే ఓ కాయిన్ ఎగరేశాను. బొమ్మ పడితే యాక్టింగ్ చేస్తాను. బొరుసు పడితే సినిమాల్లోకి రాను అనుకున్నాను. బొమ్మ పడింది. సినిమా అంగీకరించాను’ అని చెప్పుకొచ్చింది ప్రీతి.
అయితే.. షూటింగ్ మొదలైన కొన్నాళ్లకు ఆ సినిమా మూలన పడింది. ఆ విధంగా.. మణిరత్నం ‘దిల్ సే’ తో ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రీతిజింటా. ఆ సినిమా హిట్ కావడంతో స్టార్‌గా మారింది. అయితే.. కొన్నాళ్లకు వేరే టీమ్ ‘తర రమ్ పమ్’ సినిమాను సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో చేసింది. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ‘అది కూడా విధి నిర్ణయమే కావచ్చు’ అంటోంది ప్రీతి. ఆ విధంగా.. కాయిన్ తో లైఫ్ ను డిసైడ్ చేసుకొని, యాక్సెప్ట్ చేసిన తొలి సినిమా ఆగిపోయి, మరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టి, స్టార్ గా మారింది ప్రీతి. భలే ఇంట్రస్టింగ్ ఉంది కదూ.. ఈ సొట్టబుగ్గల అమ్మడి సినీ జర్నీ!