Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్'లో అవకాశం అలా వచ్చింది: అలియా భట్

By:  Tupaki Desk   |   15 March 2021 4:00 PM GMT
ఆర్ఆర్ఆర్లో అవకాశం అలా వచ్చింది: అలియా భట్
X
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమాకు 'రౌద్రం రుదిరం రణం' పేరును ఖరారు చేశారు. ఈ పాన్ ఇండియా మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు. అవుతే చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఎన్టీఆర్ జోడిగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభించిన ఆర్ఆర్ఆర్ టీమ్.. అలియాతో షెడ్యూల్ పూర్తి చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీతో అలియా భట్ తెలుగుకు పరిచయం అవుతోంది. ఈ సినిమాకోసం అలియా తెలుగు కూడా నేర్చుకుంటోంది. లాక్ డౌన్ ముందునుండే అలియా తెలుగు డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తోందట.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా సీత క్యారెక్టర్ పోషిస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం అలియాను ఎందుకు ఎంచుకున్నారో ఇదివరకే రాజమౌళి చెప్పేసాడు. 'ఆర్ఆర్ఆర్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లేనప్పటికీ.. సీత పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో పోటీపడి సీత క్యారెక్టర్ ఎమోషన్స్ పండించాలని.. సీత అమాయకురాలు కానీ స్ట్రాంగ్ లేడీ. అందుకే ఆలియాను తీసుకున్నట్లు చెప్పాడు. కానీ తాజాగా అలియా ఆర్ఆర్ఆర్ లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. 'ఓరోజు విమానాశ్రయంలో రాజమౌళి సార్ ను కలిసాను. మీ సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి. ఏదైనా నటిస్తాను. అలాగే నా కాల్ షీట్స్ కూడా అడ్జెస్ట్ చేసుకుంటానని అడిగాను. ఓ వారం తర్వాత రాజమౌళి సార్ నుండి కాల్ వచ్చింది. సీత క్యారెక్టర్ ఉంది అని చెప్పారు. అలా నేను ఆర్ఆర్ఆర్ లో భాగమాయ్యను' అంటూ చెప్పుకొచ్చింది ఈ వయ్యారి. ప్రస్తుతం అలియా గంగుబాయి సినిమాలో కూడా నటిస్తోంది.