Begin typing your search above and press return to search.

యాక్షన్‌ ఎలా ఉండబోతుందో ప్రేక్షకుల ఊహకే వదిలేసిన RRR టీమ్..!

By:  Tupaki Desk   |   9 Nov 2020 12:50 PM GMT
యాక్షన్‌ ఎలా ఉండబోతుందో ప్రేక్షకుల ఊహకే వదిలేసిన RRR టీమ్..!
X
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' తర్వాత గ్యాప్ తీసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''(రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫిక్షనల్‌ పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తారక్ - చరణ్ ఇంట్రో వీడియోలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ను చిత్రీకరిస్తున్నట్లు ఆర్.ఆర్.ఆర్ టీమ్ వెల్లడించింది.

'ఆర్.ఆర్.ఆర్' టీమ్ యాక్షన్ సీన్ షూట్ కి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్‌ చేసింది. దీనికి 'మీ ఊహకే వదిలేస్తున్నాం' అని కామెంట్ పెట్టింది. ఇది రాత్రి సమయంలో జరుగుతున్న ఫైట్‌ చిత్రీకరణ అని తెలుస్తోంది. మంటలు చెలరేగుతుండగా సైనికులు అటు ఇటు పరుగెడుతున్నట్లు వీడియోలో కనబడుతోంది. "చాలా రోజులుగా రాత్రి షూటింగ్ జరుపుతున్నాం. అది కూడా యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాం. దీన్ని థియేటర్‌ లో చూసేటప్పుడు మరో లెవల్లో ఉంటుంది" అని స్టంట్ మాస్టర్ వీడియోలో చెప్పుకొచ్చారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీలో అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని - అలియా భట్‌ - ఒలీవియా మోరిస్‌ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.