Begin typing your search above and press return to search.
తలైవి మూవీలో సోగ్గాడి పాత్ర లేదా..? ఆ పాత్ర లేకుండా ఆమె ఎలా?
By: Tupaki Desk | 28 April 2020 6:20 PM ISTదివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం పై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ రూపొందుతున్నాయి. ఆమె చనిపోయిన మూడేళ్లకు అందరూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. తమిళనాట రెండు వస్తున్నాయి. ఇందులో ఒకటి ది ఐరెన్ లేడీ అంటూ నిత్యామీనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక మరో క్రేజీ బయోపిక్ తలైవి. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న బయోపిక్ ఇదే. కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన విష్ణు ఇందూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇక మూడోది రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్వీన్ వెబ్ సిరీస్ ఇప్పటికే విడుదలైంది.
జయలలిత బయోపిక్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇద్దరే.. ఒకరు ఎంజీఆర్.. మరొకరు కరుణానిధి. జయలలిత జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటనలు, వివాదాస్పద సంఘటనలతో ఆమెకు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ విజయ్ ప్రకటించాడు. అమ్మ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎంజీఆర్. ఈయన పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక కరుణానిధిగా ప్రముఖ నటుడు కనిపిస్తున్నాడని తెలుస్తుంది. ఇక జయలలితమ్మ జీవితంలో ఈ ఇద్దరూ కాకుండా మరో కీలకవ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన పాత్ర శోభన్ బాబు.
ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. శోభన్ బాబు లేని జయలలిత బయోపిక్ అంటే ఉప్పు లేని పప్పు లాంటిదే అంటున్నారు. సోగ్గాడు శోభన్ బాబు-జయలలితల మధ్య అనుబంధం పై అనేక రూమర్స్ వచ్చాయి.. వాటిలో వాస్తవం ఎంత.. నిజంగానే వారు ప్రేమించుకున్నారా.. ప్రేమిస్తే ఎలా విడిపోయారు? లాంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. డైరెక్టర్ విజయ్ ఈ విషయాలన్నీ చూపించాలని అనుకున్నారట కానీ ఆమె అభిమానులు బాధ పడతారని శోభన్ ఎపిసోడ్స్ కత్తిరించినట్లు సమాచారం.. అభిమానుల కోసం ముఖ్యమైన శోభన్ బాబు పాత్ర తగ్గించడం సమంజసం కాదని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.