Begin typing your search above and press return to search.

ది రైజ్ ఆఫ్ 'మోసగాళ్లు' వీడియో రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్...!

By:  Tupaki Desk   |   18 Sept 2020 11:15 AM IST
ది రైజ్ ఆఫ్ మోసగాళ్లు వీడియో రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్...!
X
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మోసగాళ్లు'. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో ఇండియా మరియు అమెరికా దేశాలను వణికించిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'సంపాదించిన.. స్కామ్ చేసినా.. డబ్బు ఒకటే' అనే థీమ్ తో వస్తున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో మంచు విష్ణుకు సోదరిగా నటించింది. ఇప్పటికే ‘మోస‌గాళ్లు’ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌ లుక్ విడుద‌ల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుండి 'ది రైజ్ ఆఫ్ మోసగాళ్లు' అంటూ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ వీడియోను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసారు.

కాగా, 'మోసగాళ్లు' టైటిల్ లో US $ 100 నోటుతో డిజైన్ చేయబడి స్టైల్ గా ఆకర్షణీయంగా ఉంది. దీనికి ఉపయోగించిన థీమ్ మ్యూజిక్ వింటుంటే ఈ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఉండబోతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఒకేసారి రూపొందించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ భారీ బడ్జెట్ తో అత్యున్నతమైన సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ లాస్ ఏంజెల్స్‌ మరియు హైద‌రాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. అలానే 'మోసగాళ్లు' లో రుహానీ సింగ్ - న‌వ‌దీప్ - నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.