Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాల రికార్డులు మణి సర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్ టార్గెట్‌

By:  Tupaki Desk   |   27 Sep 2022 12:30 AM GMT
ఆ రెండు సినిమాల రికార్డులు మణి సర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్ టార్గెట్‌
X
తమిళ్‌ బాహుబలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పొన్నియిన్‌ సెల్వన్ విడుదలకు మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వారంలోనే విడుదల కాబోతున్న ఈ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ వసూళ్ల గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతోంది. తెలుగు తెలుగు సినిమాలు ఒక కన్నడ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను క్రాస్ చేయడంతో తమిళం నుండి ఈ సినిమా ఆ మార్క్ ను క్రాస్ చేయబోతున్న మొదటి సినిమా అంటూ అక్కడి మీడియా తెగ ప్రచారం చేస్తోంది.

ఇతర భాషల మీడియా మాత్రం పొన్నియన్‌ సెల్వన్‌ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మొదట తమిళంలో రికార్డులు సృష్టించిన రజినీకాంత్‌.. శంకర్ ల 2.0 మరియు కమల్‌ హాసన్.. లోకేష్ కనగరాజ్ యొక్క విక్రమ్‌ సినిమా రికార్డులను బ్రేక్ చేయడమే గొప్ప విషయం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తమిళనాట విక్రమ్‌ సినిమా ఆల్‌ టైమ్‌ ఇండస్ట్రీ రికార్డు సాధించిన విషయం తెల్సిందే.

తమిళనాట అత్యధిక వసూళ్లు నమోదు చేసిన విక్రమ్‌ రికార్డును పొన్నియన్ సెల్వన్‌ బ్రేక్ చేస్తే చేయవచ్చు.. కానీ ప్రపంచ వ్యాప్తంగా 2.0 సినిమా సాధించిన వసూళ్లను మాత్రం పొన్నియన్‌ సెల్వన్‌ బ్రేక్ చేయడం అసాధ్యం అంటూ తమిళేతర మీడియా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఆ రికార్డును బ్రేక్‌ చేస్తే అప్పుడు వెయ్యి కోట్ల వసూళ్ల గురించి ఆలోచించాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విక్రమ్‌.. కార్తీ.. ఐశ్వర్య రాయ్‌.. త్రిష.. జయం రవి ఇలా ఎంతో మంది స్టార్‌ కాస్ట్‌ ఉన్న ఈ సినిమా తమిళనాట విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. అందుకే ఇప్పటికే అక్కడ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్‌ టైమ్‌ రికార్డు ను నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.

ఇక సినిమాకు మినిమంగా పాజిటివ్‌ టాక్‌ వస్తే అక్కడ రికార్డులు బ్రేక్ అవ్వడం ఖాయం. కానీ వెయ్యి కోట్ల క్లబ్‌ లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం అద్భుతం అన్నట్లుగా నిలవాలి... సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. మరి ఆ స్థాయిలో మణి సర్ పొన్నియన్ సెల్వన్‌ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.