Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజుల వెనుక అస‌లు ర‌హ‌స్యం వేరే ఉందా...?

By:  Tupaki Desk   |   29 Aug 2020 6:00 AM IST
ఓటీటీ రిలీజుల వెనుక అస‌లు ర‌హ‌స్యం వేరే ఉందా...?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటోంది. గత ఐదు నెలలుగా థియేటర్ల మూసివేసి ఉండటంతో సినిమా రిలీజులు ఆగిపోయాయి. అయితే నష్టాల నుండి బయటపడటానికి మరో ఆప్షన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఉండటంతో మేకర్స్ అందరూ తమ సినిమాలను ఓటీటీలలో విడుదల చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా రిలీజ్ లు ఊపందుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో తెలియకపోవడంతో డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ప‌ద్ధ‌తికి స్వాగతం ప‌లుకుతున్నారు. ఈ క్రమంలో ఒకటి అర పెద్ద సినిమాలు తప్ప.. స్మాల్ మీడియం రేంజ్ సినిమాలన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువ శాతం మంది నిర్మాతలు ఫైనాన్సుకి తెచ్చిన డబ్బులు వడ్డీలు కట్టలేకే తమ సినిమాలను డిజిటల్ రిలీజ్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అయితే దీని వెనుక అస‌లు ర‌హ‌స్యం వేరే ఉందని ఓటీటీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిన్న సినిమాలన్నీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అయితే చిన్న మరియు మీడియం రేంజ్ మేకర్స్ అందరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి ఫైనాన్సియర్స్ నుంచి వస్తున్న ఒత్తిడి కారణమని తెలుస్తోంది. కాకపోతే ఫైనాన్సియర్స్ ఇలా చిన్న నిర్మాతలపై ఒత్తిడి చేయడం వెనుక పెద్ద నిర్మాతల చెయ్యి ఉందని టాక్ వినిపిస్తోంది. పెద్ద నిర్మాతలు చాలామంది ఫైనాన్స్ అవసరం లేకుండానే సినిమాలు నిర్మిస్తుంటారు. ఈ నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ చేసాక చిన్న సినిమాల నుంచి పోటీని త‌ప్పించేందుకు కొంద‌రు బ‌డా ప్రొడ్యూసర్స్ వెనుక నుంచి ఫైనాన్సియర్స్ ని బుట్టలో వేసుకొని వారిని చిన్న నిర్మాతలపై ఉసిగొల్పుతున్నారట. ఈ విధంగా చిన్న నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకొని డ‌బ్బులు సెటిల్ చేసేలా చేస్తున్నార‌ట. రాబోయే రోజుల్లో థియేటర్స్ ఓపెన్ చేస్తే క్రేజ్ ఉన్న చిన్న సినిమాలు పెద్ద సినిమాలకు థియేటర్స్ దగ్గర పోటీకి దిగుతారనే ఇన్ సెక్యూరిటీతోనే పెద్ద నిర్మాత‌లు ఇలా చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ నిర్మాతలు ఎక్కువ మొత్తానికి ఫైనాన్స్ తెచ్చి నిర్మించనవే అని తెలుస్తోంది.