Begin typing your search above and press return to search.

సౌత్‌ హీరోల్లో నిజమైన పాన్‌ ఇండియా స్టార్‌

By:  Tupaki Desk   |   1 Oct 2020 9:30 AM GMT
సౌత్‌ హీరోల్లో నిజమైన పాన్‌ ఇండియా స్టార్‌
X
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ స్టార్‌ లు అంతా కూడా ఇప్పుడు పాన్‌ ఇండియా మూవీస్‌ మంత్రం జపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోలు పలువురు పాన్‌ ఇండియా క్రేజ్‌ కోసం తాపత్రయ పడుతున్నారు. ప్రభాస్‌ బాహుబలితో ఇప్పటికే పాన్‌ ఇండియా స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ప్రభాస్‌ తర్వాత ఉత్తరాదిన క్రేజ్‌ ఉన్న హీరో ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు విజయ్‌ దేవరకొండ. ఈయన నటించిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు పాన్‌ ఇండియా రేంజ్‌ లో విడుదల అవ్వలేదు. డబ్బింగ్‌ వర్షన్‌ మూవీస్‌ కూడా యూట్యూబ్‌ లో తప్ప థియేటర్లలో ఆకట్టుకోలేదు. అయినా కూడా ఉత్తరాది ప్రేక్షకులు విజయ్‌ దేవరకొండను విపరీతంగా అభిమానిస్తున్నారు అంటూ ఆయన ఫాలోవర్స్‌ సంఖ్యను బట్టి అర్థం చేసుకోవచ్చు.

సౌత్‌ లో ఏ ఒక్క హీరోకు లేని ఫాలోవర్స్‌ సంఖ్యను విజయ్‌ దేవరకొండ దక్కించుకున్నాడు. ఇన్‌ స్టాగ్రామ్‌ లో ఆయన ఏకంగా 9 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను క్రాస్‌ చేశాడు. మహేష్‌ బాబు ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు సైతం 6 మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను సంపాదించలేక పోయారు. అలాంటిది విజయ్‌ దేవరకొండ ఏకంగా 10 మిలియన్‌ లకు చేరువ అవ్వడం ఆయన క్రేజ్‌ కు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ అభిమానులు అంటున్నారు. విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ ఆయన రియల్‌ పాన్‌‌ హీరో అంటున్నారు. ప్రస్తుతం ఆయన పూరి దర్శకత్వంలో చేస్తున్న పాన్‌ ఇండియా మూవీతో మరింత క్రేజ్‌ ను దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు సైతం నమ్మకంగా ఉన్నారు.