Begin typing your search above and press return to search.

ఈ స్టార్ హీరోయిన్ల అసలు పేర్లు తెలుసా..?

By:  Tupaki Desk   |   22 July 2022 9:49 AM GMT
ఈ స్టార్ హీరోయిన్ల అసలు పేర్లు తెలుసా..?
X
సినిమా వాళ్ళకి నమ్మకాలు కొంచెం ఎక్కువ అని అంటుంటారు. సెంటిమెంట్లకు న్యూమరాలజీకి జాతకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని చెబుతుంటారు. నిజానికి పేరులో కూడా అదృష్టం ఉందని చాలామంది సెలబ్రిటీలు భావిస్తుంటారు.

సంఖ్యా శాస్త్రాన్ని నమ్మి పేర్లు మార్చుకున్న వాళ్ళు కొందరైతే.. అసలు పేరు బాగాలేదని స్క్రీన్ నేమ్ ను పెట్టుకున్న వారు మరికొందరు ఉన్నారు. అప్పటికే అలాంటి పేరుతో వేరొక నటుడు లేదా నటి ఉండటం వల్లనో.. లేక వేరే ఇతర కారణాల వల్లనో పేర్లను మార్చుకున్నవారు కూడా ఉన్నారు.

అలనాటి హీరోహీరోయిన్ల నుంచి నేటితరం నటీనటుల వరకూ ఎందరో నేమ్ మార్చుకుని ఫేట్ మార్చుకున్న వారు ఉన్నారు. కొత్త లేరు కలిసిరాక మళ్లీ పాత పేరుతోనే పిలిపించుకున్నవారు ఉన్నారనే సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో పేరు మార్చుకున్న హీరోయిన్లు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.

అనుష్క: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న ఈ కన్నడ బ్యూటీ అసలు పేరు స్వీటీ శెట్టి. 'సూపర్' సినిమాతో అనుష్క గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

నయనతార: లేడీ సూపర్ స్టార్ ఒరిజినల్ నేమ్ డయాన మరియమ్ కురియన్. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నయనతారగా మారింది ఈ మలయాళీ భామ.

సమంత రూత్ ప్రభు: 'ఏమాయ చేసావే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సామ్ కు 'యశోద' అనే నిక్ నేమ్ కూడా ఉంది. ప్రస్తుతం ఇదే పేరుతో ఓ సినిమా కూడా చేస్తోంది.

కియారా అద్వానీ: 'భరత్ అనే నేను' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అసలు పేరు అలియా అద్వానీ.

కృతి శెట్టి: 'ఉప్పెన' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ అందుకున్న కృతి అసలు పేరు అద్వైత. గూగుల్ లో అద్వైత అని సెర్చ్ చేస్తే కృతి తో పాటుగా మరో తమిళ నటి ఫొటోలు దర్శనమిస్తుంది.

పేరు మార్చుకున్న మరికొందరు హీరోయిన్లు:
జయసుధ - సుజాత నిడదవోలు
జయప్రద - లలితా రాణి
శ్రీదేవి - శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్
రేఖ - భానురేఖ గణేశన్
రోజా - శ్రీలతా రెడ్డి
రంభ - విజయలక్ష్మి
టబు - టబుస్సుమ్ హష్మి
సౌందర్య - కె.ఎస్.సౌమ్య
స్నేహ - సుహాసిని రాజారత్నం
భుమికా చావ్లా - రచనా చావ్లా
మల్లికా శెరావత్ - రీమా లంబా
శిల్పా శెట్టి - అశ్విని శెట్టి
కత్రినా కైఫ్ - కత్రినా టర్కొట్టే
సన్నీ లియోనీ - కరణ్​జీత్ కౌర్ వోహ్రా
అర్చన శాస్త్రి - వేద
ఆశా షైనీ - ఫ్లోరా. షైనీ