Begin typing your search above and press return to search.

చీరకట్టులోనే దాగుంది అందాల అసలు గుట్టు!

By:  Tupaki Desk   |   3 April 2021 2:17 PM IST
చీరకట్టులోనే దాగుంది అందాల అసలు గుట్టు!
X
అందగత్తెలందరూ అప్సరసల గ్రూపులోకే వెళ్లాలి. కానీ కొంతమంది అమ్మాయిలు మాత్రం ఎంతసేపు ఇంద్రుడి ఇలాకాలోనే ఉండిపోతామని చెప్పేసి, భూలోకానికి వచ్చేశారు. అందం ఉన్నవాళ్లంతా దానిని తెరపై చూపించినప్పుడే ఆ అందానికి ఒక అర్థం ఉంటుందనుకుని, కథానాయికల కాలనీలోకి చేరిపోయారు. అలా అందగత్తెల జాబితాలో తన పేరును నమోదు చేసుకుని, తెరపై తెల్ల తామరలా విరిసిన సౌందర్యమే పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే ఆమె భారీ అందాల భామగా గుండె గుహల్లో కలల కాగడాలు వెలిగించింది.

పాయల్ మంచి పొడగరి కావడం వలన ఆమె మోడ్రెన్ డ్రెస్సుల్లోనే కాదు .. చీరకట్టులోను ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలా చీరకట్టులోని ఓ ఫొటోనే పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఉప్పెన తీరాన్ని కమ్మేసినట్టు పసిడి సొగసులను పల్చని చీరలో కప్పేసే ప్రయత్నం చేసింది. సిగ్గుల మొగ్గలామారిపోయి అజంతా శిల్పానికి అక్కసు పుట్టేలా చేసింది. విల్లులా విచ్చుకున్న ఆ పెదాలపై ప్రేమ సామ్రాజ్యాలు స్థాపించడానికి కుర్రాళ్లంతా చేయిచేయి కలిపేలానే ఉన్నారు. అందాన్ని చూస్తే చాలు కుర్రాళ్లంతా తమ కళ్లకు కళ్లాలు వదిలేస్తుంటారని వేరే చెప్పాలా?

తెరపై పాయల్ ఓ రాజహంసలా కనిపిస్తుంది .. నెమలి అడుగుల సవ్వడిని కోయిల గొంతుకతో వినిపిస్తుంది. ఆమె హొయలు చూసినవాళ్లు నండూరి ఎంకిని ఊహించుకుంటారు .. వేటూరి పాటలా ఉందనుకుంటారు. పాలరాతి శిల్పంలాంటి ఈ పిల్లను కనురెప్పలపై పెట్టుకుని ఊరేగిస్తూ ఉంటారు. అందాలతో ఈ అమ్మాయి చేసే ఆగడాలను చూస్తూ తెరచాప పడవలా తేలిపోతుంటారు. సోషల్ మీడియా ద్వారానే సొమ్మసిల్లిపోయేలా చేస్తున్న పాయల్, తెరపై ఘాటు పెంచాలని కోరుకుంటున్నారు.