Begin typing your search above and press return to search.

'పుష్ప' విలన్‌ రేంజ్ కు ఇదే సాక్ష్యం

By:  Tupaki Desk   |   4 July 2021 10:30 AM GMT
పుష్ప విలన్‌ రేంజ్ కు ఇదే సాక్ష్యం
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా క్రేజీ మూవీ పుష్ప లో విలన్‌ గా నటిస్తున్న ఫాహాద్‌ ఫాజిల్ సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా గుర్తింపు దక్కించుకున్నాడు. మలయాళంలో ఈయన స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసేందుకు ఈయన ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ఫాహాద్ ఫాజిల్‌ మలయాళ ప్రేక్షకుల ముందుకు ఎన్నో విభిన్నమైన సినిమాలను తీసుకు వచ్చాడు. త్వరలో ఈయన మాలిక్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మాలిక్ సినిమా ను థియేటర్ల ద్వారా విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ తో థియేటర్లు మూత పడ్డాయి. ఇప్పటి వరకు థియేటర్ల విషయమై స్పష్టత లేదు. దాంతో మాలిక్‌ సినిమాను మేకర్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు అమ్మేశారు. ఆ సినిమాకు గాను అమెజాన్‌ వారు రూ.14 కోట్లను పెట్టినట్లుగా మలయాళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మలయాళం సినిమా ఇంత భారీ మొత్తంలో అమ్ముడు అవ్వడం చాలా అరుదు. మోహన్‌ లాల్‌ వంటి సూపర్‌ స్టార్‌ సినిమాలకే ఈ రేంజ్ లో ఓటీటీ బిజినెస్ అవుతుంది.

మాలిక్ సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో అమెజాన్‌ వారు ఈ భారీ మొత్తంను పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఫాహద్‌ సినిమా అనగానే ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. సబ్ టైటిల్స్ తో మలయాళ సినిమాను ఇతర భాషల వారు చూడటం ఈమద్య చాలా కామన్‌ అయ్యింది. అందుకే ఫాహద్‌ ఫాజిల్‌ మాలక్ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప సినిమా లో ఈయన నటించడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి బిజినెస్ అవుతుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.