Begin typing your search above and press return to search.

మెగా డాట‌ర్ `సేనాప‌తి` క‌థేంటి?

By:  Tupaki Desk   |   12 Dec 2021 9:20 AM GMT
మెగా డాట‌ర్ `సేనాప‌తి` క‌థేంటి?
X
అల్లు అర‌వింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వ్య‌వ‌స్థ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఆహా 2.0 ని కూడా లాంచ్ చేసి న‌ట‌సింహ బాల‌కృష్ణ‌తో ప్ర‌త్యేక ప్రోగ్రామ్ లు సైతం చేప‌డుతున్నారు. భ‌విష్య‌త్ సినిమా అంతే ఓటీటీదే కావ‌డంతో అల్లు అర‌వింద్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఓటీటీని బిల్డ్ చేస్తున్నారు. సినిమాలు..వెబ్ సిరీస్ లు... సెల‌బ్రిటీ స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలతో ఆహా విజ‌య‌వంతంగా ముందుకు సాగిపోతుంది. ఇత‌ర భాష‌ల్లోనూ ఆహాని లాంచ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇక మెగా కాపౌండ్ సొంత కంటెంట్ కి ఆహా బ్యాక్ బోన్ లా నిలుస్తుంది. తాజాగా `సేనాప‌తి` అనే వెబ్ సిరీస్ ని ఆహాలో రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు.

`సేనాప‌తి`లో న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. న‌రేష్..అగ‌స్త్య‌..జ్ఞానేశ్వ‌ర్.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్..రాకేంద్ మౌళ‌ఙ ఇత‌ర పాత్రలు పోషిస్తున్నారు. `ప్రేమ్ ఇష్క్ కాద‌ల్` ఫేం ప‌వ‌న్ సాధినేని ఈ సిరీస్ కి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మిస్తున్నారు. `సేనాప‌తి` ప్ర‌మోష‌న్ లో భాగంగా మోష‌న్ పోస్ట‌ర్ ని సాయిధ‌ర‌మ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. తాత‌య్య- మ‌న‌వ‌డి సంభాష‌ణ మ‌ధ్య పోస్ట‌ర్ లాంచ్ అవుతుంది. ఇందులో ఏడుగురు కొడుకులు..చేప‌ల క‌థ‌ని ఓ రైతు చెప్ప‌డం.. రాజేంద్ర ప్ర‌సాద్ చెప్పే క‌థ‌నం ఓ ఇంటెన్స్ ని తీసుకొస్తుంది.

పోస్ట‌ర్ లో రాజేంద్ర ప్ర‌సాద్ ముఖానికి తుపాకీ గురి పెట్టి ఉంటుంది. మరి ఆ సంగ‌తులు ఏంటో తెలియాలంటే సిరీస్ రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. రాజేంద్ర ప్ర‌సాద్ వెండి తెర న‌టుడిగానే బిజీగానే ఉన్నారు. అగ్ర హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయినా వ‌చ్చిన వెబ్ సిరీస్ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కుండా ఓటీటీ వేదిక‌గా ఇక్క‌డా ఎంట్రీ ఇస్తున్నారు. న‌టుడిగా న‌ట‌కిరిటీ స‌క్సెస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌గ‌ల న‌టుడు.