Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరోలకి ప్రమోషన్స్ పిచ్చి మరీ ఎక్కువైందా...?

By:  Tupaki Desk   |   2 July 2020 8:45 AM IST
ఆ స్టార్ హీరోలకి ప్రమోషన్స్ పిచ్చి మరీ ఎక్కువైందా...?
X
‘సినిమా’ అనేది ఓ ఎంటర్టైన్మెంట్ సాధనం. ఈ ఎంటర్టైన్మెంట్ అందించే సినీ ఇండస్ట్రీలో ఏమి జరుగుతుంది.. సినిమా వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని.. నిజానికి వారు ఏం చేసినా తెలుసుకోవాలని సగటు సినీ అభిమానికి ఉంటుంది. ఇక సినీ సెలబ్రిటీల సినిమా జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఏం జరుగతుందోనని ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టు గానే సినీ సెలబ్రిటీస్ కూడా తమ విషయాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ అభిమానులకు తమ విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు మూడున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీ మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీస్ వర్కౌట్ వీడియోలని.. వంటల వీడియోస్ అని.. ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని తమని తాము సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు.

ఇక్కడి దాకా ఒక ఎత్తైతే కొంతమంది పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది స్టార్ హీరో హీరోయిన్స్ తాము ఇంట్లో చేసే పనులను తమ టీమ్ ద్వారా బయటకి వదులుతున్నారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ చూస్తుంటే ఒకానొక దశలో మరి దారుణంగా మారిపోతుందిగా పబ్లిసిటీ పిచ్చి అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది న్యూస్లో వేస్తారో.. ఏది న్యూస్లో వెయ్యరో అనే కనీసం ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఓ స్టార్ హీరో తన పిల్లతో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో స్నానం చేయడం న్యూస్ యేనా..? అతను తన పిల్లతో ఈత కొడుతున్న ఫోటోలను.. తన పిల్లతో పడుకున్న ఫోటోలను మీడియాకి వదులుతున్నారు. ఇవి చూసిన సినీ అభిమానులు ఏంటండీ ఇది.. మరీ ఇంత దారుణమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి వారి పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టుకుంటే ఇలాంటి కామెంట్స్ వినపడవు. కానీ మరీ వాటిని మీడియా వారికి షేర్ చేసి వాటి మీద ఆర్టికల్స్ వచ్చేలా చేయమనడం కాస్త ఇబ్బందే.

ఏదేమైనా ఆ స్టార్ హీరోకి కావాల్సినంత క్రేజ్ ఉంది.. ఇప్పుడు కొత్తగా అతన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ఈ పబ్లిసిటీ పిచ్చి ఎందుకో అర్ధం కావడం లేదని ఫిల్మ్ మీడియాతో పాటు ఫిల్మ్ సర్కిల్స్ లో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ స్టార్ హీరోని చూసి మరో స్టార్ హీరో స్టార్ట్ చేశారు. ఈ హీరోకి పోటీ పడి మరి ఇలాంటి పోస్టులు వీడియోలు పెడుతున్నారు. కాకపోతే మరీ స్నానం చేసే వీడియోలు పెట్టకుండా కొంచెం బెటర్ గానే ఉంటున్నాయి. ఇప్పుడు వీరిని చూసి ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ ఇదే పధ్ధతి ఫాలో అయితే కష్టమే. సందర్భం ఏదైనా కావచ్చు మేము పబ్లిసిటీ చేసుకుంటాం అంటే ఎవరు మాత్రం ఏమి చేయగలం లేండి. రామ్ గోపాల్ వర్మ సినిమాలో చెప్పినట్లు 'పబ్లిసిటీ.. పబ్లిసిటీ.. ఇది సినిమా వాళ్ల యాక్టివిటీ' అనేది నిజమే అనిపిస్తుంది.