Begin typing your search above and press return to search.

'లంబ‌సింగి' అందాల్లో ప్రోమో మెప్పించేసిందే!

By:  Tupaki Desk   |   14 April 2022 10:30 AM GMT
లంబ‌సింగి అందాల్లో ప్రోమో మెప్పించేసిందే!
X
ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' స‌క్సెస్ తో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌త రెండుచిత్రాల‌తో రేసులో వెనుక‌బ‌డినా 'బంగ‌ర్రాజు' విజయం ఆయ‌న‌లో జోష్ ని నింపింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంలో నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్న‌ట్లు తెలుస్తోంది. క‌ళ్యాణ్ కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత జికె మోహన్ కాన్సెప్ట్ ఫిల్మ్ బ్యాన‌ర్ పై కొత్త న‌టీన‌టుల‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆ చిత్రానికి 'లంబసింగి' అనే టైటిల్ ఖ‌రారు చేసారు. 'ఎ ప్యూర్ లవ్ స్టోరీ' అనేది ట్యాగ్‌లైన్. న‌వీన్ గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంతో భ‌ర‌త్ అనే కొత్త కుర్రాడు హీరోగా ప‌రిచయం అవుతున్నాడు.

అలాగే బిగ్ బాస్ ఫేమ్ దివి వడ్త్యా హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇంకా కీల‌క పాత్ర‌ధారులంతా కూడా చాలా మంది కొత్త వార‌ని తెలుస్తోంది. పూర్తిగా ఔత్సాహిక ప్ర‌తిభ‌ని ప్రోత్సహిస్తూ తెర‌క్కిస్తున్న చిత్రంలా క‌నిపిస్తుంది.

ఈ చిత్రం లో 'న‌చ్చేసిందే న‌చ్చేసిందే నాకెంతో న‌చ్చిందే ఈ పిల్ల‌..న‌వ్వేసిందే న‌వ్వ‌సిందే నామ‌నసే తవ్వేసిందే' సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమో ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. లంబ‌సింగి అందాల న‌డుమ పాట చిత్రీక‌ర‌ణ జరిపిన‌ట్లు తెలుస్తోంది. లంబ సింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే అంద‌మైన ల‌వ్ స్టోరీ జాన‌ర్ లా క‌నిపిస్తుంది. మొత్తం లిరిక‌ల్ వీడియో సాంగ్ ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని స్టార్ సింగ‌ర్ సిద్ద్ శ్రీరామ్ ఆల‌పించ‌డం విశేషం. దీంతో పాట రిలీజ్ కోసం శ్రోత‌లు ఎగ్జైట మెంట్ తో ఎదురచూడ‌టం ఖాయం. RR దృవన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. లీడ్ పెయిర్‌పై చిత్రీకరించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే షూట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇతర సాంకేతిక సిబ్బంది విషయానికి వస్తే కె బుజ్జి సినిమాటోగ్రాఫర్ మరియు కె విజయ్ వర్ధన్ ఎడిటర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.