Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో న్యూ ప్రామిసింగ్ గ్లామరస్ హీరోయిన్ గా మారుతున్న మీనాక్షి చౌదరి

By:  Tupaki Desk   |   23 Sept 2022 12:52 PM IST
టాలీవుడ్ లో న్యూ ప్రామిసింగ్ గ్లామరస్ హీరోయిన్ గా మారుతున్న మీనాక్షి చౌదరి
X
టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్​గా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం మెప్పించకపోయిన ఈ ముద్దుగుమ్మ అందానికి, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించ లేకపోయినప్పటికీ ఈ మూవీ లో మీనాక్షి చౌదరి మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును హీటెక్కించింది .

ప్రస్తుతం ఈమె వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఈమె నటించిన హిట్-2 చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. నేచరల్ స్టార్ నాని ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారించారు. అలానే ఈమె తమిళ్ లో కూడా బాగానే రాణిస్తుంది. ప్రస్తుతం "కొలై" అని చిత్రం తమిళ్ లో రిలీజ్ కు రెడీ గా ఉంది. అలానే తమిళ్ మరో కొత్త చిత్రం చేసేందుకు కూడా ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతుంది.

మీనాక్షి చౌదరి తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకర్షిస్తుంది.ఏదేమైనా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న న్యూ ప్రామిసింగ్ యాక్ట్రెస్ లో మీనాక్షి చౌదరి ఒకరు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.