Begin typing your search above and press return to search.

శ్రీ‌విష్ణు 'అల్లూరి' ప్రీ లుక్ అదిరింది

By:  Tupaki Desk   |   5 April 2022 6:30 AM GMT
శ్రీ‌విష్ణు అల్లూరి ప్రీ లుక్ అదిరింది
X
విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు యంగ్ హీరో శ్రీ‌విష్ణు. ఛాలెంజింగ్ పాత్ర‌ల‌తో పాటు ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌ల‌ని ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రానికి 'అల్లూరి' అనే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు.

ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్ పై బెక్కెం వేణు గోపాల్‌, బెక్కెం బ‌బిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ లుక్ పోస్ట‌ర్ ని మాస్ మ‌హారాజా ర‌వితేజ మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

ఇందులో హీరో శ్రీ‌విష్ణు నిజాయితీగ‌ల పోలీస్ ఆఫీస‌ర్ ఏ.ఎస్‌. రామ‌రాజు (అల్లూరి సీతారామ‌రాజు) గా క‌నిపించ‌బోతున్నారు. క‌యాడు లోహ‌ర్ హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్రీ లుక్ పోస్ట‌ర్ లో హీరో శ్రీ‌విష్ణు ఖాకీ డ్రెస్ లో పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నిపిస్తున్నాడు. ఫేస్ పై షాడో క‌నిపిస్తోంది.

అంతే కాకుండా టైటిల్ పై టూ గ‌న్స్ క‌నిపిస్తూ టైటిల్ ప‌వ‌ర్ ఫుల్ గా వుంది. చూస్తుంటే ఓ ప‌వ‌ర్ ఫుల్ కాప్ డ్రామాగా ఈ మూవీ వుంటుంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇంటెన్స్ కాప్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ రామ‌రాజు పాత్ర చుట్టూ తిరుగ‌నుంది.

టైటిల్ పోస్ట‌ర్ కి క్యాప్ష‌న్ గా 'ది గ్రేటెస్ట్ పోలీస్ స్టోరీ ఎవ‌ర్ టోల్డ్‌' అని రాశారు. ప్రీ లుక్ పోస్ట‌ర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. సినిమాపై అంచ‌నాల్ని క్రియేట్ చేసింది. విభిన్న‌మైన క‌థ‌తో ఫెరోషియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ శ్రీ‌విష్ణు కెరీర్ ని మ‌లుపుతిప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సైలెంట్ గా గ‌త కొన్ని నెల‌ల నుంచి షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

త‌నికెళ్ల భ‌ర‌ణి, సుమ‌న్, రాజా ర‌వీంద్ర‌, పృథ్వీరాజ్‌, ర‌వివ‌ర్మ‌, మ‌ధుసూద‌న్ రావు, జ‌య‌వాణి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి నేప‌థ్య సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్ర‌హ‌ణం రాజ్ తోట‌, ఎడిట‌ర్ ధ‌ర్మేంద్ర కాక‌ర్ల‌. పాట‌లు రాంబాబు గోసాల‌, ఆర్ట్ విఠ‌ల్ కోస‌నం. గ‌త కొన్ని నెల‌లుగా వ‌రుస ఫ్లాపుల‌తో వున్న శ్రీ విష్ణుని అల్లూరి అయినా గ‌ట్టెక్కిస్తాడా చూడాలి అంటున్నారు ఆయ‌న అభిమానులు.