Begin typing your search above and press return to search.

అల్లు స్టూడియోస్ ప్రారంభం.. వాళ్లకు సన్మానం

By:  Tupaki Desk   |   27 Sep 2022 10:31 AM GMT
అల్లు స్టూడియోస్ ప్రారంభం.. వాళ్లకు సన్మానం
X
టాలీవుడ్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అల్లు స్టూడియోస్ అందుబాటులోకి వచ్చే రోజు దగ్గర పడింది. కోకా పేట లో అల్లు వారు నిర్మిస్తున్న అల్లు స్టూడియోస్‌ నిర్మాణం దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చింది.

ఇక అక్టోబర్ 1వ తారీకున అల్లు రామలింగయ్య గారి వందవ జయంతి ని కుటుంబ సభ్యులు వైభవంగా జరుపుకోబోతున్నారు. ఆ సందర్భంగా అల్లు స్టూడియోస్ ను లాంచనంగా ప్రారంభించబోతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సమక్షంలో అల్లు స్టూడియోస్ ప్రారంభ కార్యక్రమంను నిర్వహించబోతున్నారు. అదే సమయంలో టాలీవుడ్‌ కు చెందిన ప్రముఖ కమెడియన్స్ ని మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా సన్మానించేందుకు కూడా అల్లు వారు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పాత వారు కొత్త వారు కలిపి మొత్తం 20 మంది వరకు తెలుగు సినీ కమెడియన్స్ ని అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సత్కరించేందుకు గాను అల్లు ఫ్యామిలీ ఏర్పాట్లు చేసి ఇప్పటికే ఆ కమెడియన్స్ కి మెసేజ్ పాస్ చేసినట్లుగా తెలుస్తోంది. అల్లు స్టూడియోస్‌ ప్రారంభించిన వెంటనే అందులో మొదటి సినిమా గా పుష్ప 2 సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని కూడా భావిస్తున్నారు.

పుష్ప 2 సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా బన్నీ సెంటిమెంట్‌ కోసం పుష్ప 2 ను అల్లు స్టూడియోలో మొదలు పెట్టాలని వాయిదా వేశారట. అక్టోబర్ రెండవ లేదా మూడవ వారంలో అల్లూ స్టూడియోస్ లో పుష్ప 2 షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఉన్న రామోజీ ఫిల్మ్‌ సిటీ.. రామానాయుడు స్టూడియోస్.. అన్నపూర్ణ స్టూడియోస్ ఇంకా కొన్ని స్టూడియోస్ యొక్క పోటీని అల్లు స్టూడియోస్‌ ఎంత వరకు తట్టుకుంటుంది.. అక్కడ సినిమా మేకింగ్‌ కి ఎలాంటి వసతులు ఉన్నాయి అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.